Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedతెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ లో ఏ మూలకైనా వెళ్లి తాము అమలు చేస్తు న్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప రిశీలించవచ్చని, తెలంగాణ అభివృద్ధిపై వి జయన్‌తో ఎప్పుడంటే అప్పుడు చర్చకు సి ద్ధమని కేరళం సిఎం పినరయి విజయన్ స హా ఎల్డీఎఫ్ నేతలకు సిఎం రేవంత్‌రెడ్డి సవా ల్ విసిరారు. ఈ ఎన్నికలు కేరళం, తెలంగా ణ మధ్య కాదని, యూడిఎఫ్, ఎల్డీఎఫ్‌ల మ ధ్య జరుగుతున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేరళ సిఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖపై తెలంగాణ సిఎం రేవం త్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ, కేరళం సిఎం విజయన్‌ల మధ్య ఒ ప్పందం ఉందని, తెలంగాణలో ప్రజలు కె సిఆర్‌ను ఎలా మార్చారో కేరళంలో విజయన్‌ను కూడా అలా మారుస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. పినరయి విజయన్ స్నేహితుడు కెసిఆర్ 2023, -24 ముందు వరకు తెలంగాణలో అధికారంలో ఉండేవారని, అప్పుడు తెలంగాణ పరిస్థితిని విజయన్ ప్రస్తావించా రన్నారు. తాను అప్పుడు అధికారంలో లేనని ఆ పాలనను చూసే తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను ఇంటికి పంపారని, ఇప్పుడు పినరయి విజయన్ వంతు వచ్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి కోవలం, మావేలికర నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.

విజయన్ రోల్ మోడల్ నరేంద్ర మోడీనా…?

అనంతరం తిరువనంతపురంలో సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పినరయి విజయన్ పని అయిపోయిందని, మూడింట రెండొంతుల మెజార్టీతో యూడిఎఫ్ గెలుస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పినరయి విజయన్‌కు రోల్ మోడల్స్ జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీలా? లేక నరేంద్ర మోడీ, అమిత్ షానా? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోడీని విజయన్ రోల్ మోడల్‌గా భావిస్తున్నారని, ఆయన పద్ధతులు కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. విజయన్ ఓ ముఖ్యమంత్రిలా కాకుండా, మరో నరేంద్ర మోడీ తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పినరయి విజయన్‌పై ఉన్న అవినీతి కేసుల నుంచి మోడీ ప్రభుత్వం రక్షిస్తోందని ఆయన విమర్శించారు.

అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి భాగస్వాముల మధ్య ఇటువంటి వాగ్వాదం చోటుచేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించు కుందన్నారు. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం ఈ వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమయ్యిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేరళలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేరళం సిఎం పినరయి విజయన్ తన 120 నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళంలో సరైన అవకాశాలు లేక యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని ఆయన ఆరోపించారు.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments