Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఆన్‌లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ నెంబర్1

ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ నెంబర్1

మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్‌లైన్ ఆడిటిం గ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్ర ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచి, వరుసగా మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించింద ని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రంలో ఆన్‌లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గు జరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటి సిఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్య వస్థలు అత్యంత బలంగా ఉన్నాయని డిప్యూటి సి ఎం వివరించారు. రాష్ట్రంలో ఆడిట్ శాఖ పనితీరు అధ్యయనానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని,

రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి అధికారులు పూర్తిగా సహకరిస్తారని డిప్యూటి సిఎం తెలిపారు. కాగా, గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీలను సందర్శించి ఆన్‌లైన్ వ్యవస్థను అధ్యాయనం చేస్తున్నామని, రాష్ట్రంలో ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని గుజరాత్ అధికారులు డిప్యూటి సిఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments