Tuesday, April 14, 2026
Google search engine
HomeUncategorizedడీలిమిటేషన్‌పై సిఎంకు అవగాహన లేదు

డీలిమిటేషన్‌పై సిఎంకు అవగాహన లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: డీ-లిమిటేషన్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించగా, డీ-లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏమిటీ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులిరువురూ వేర్వేరుగా ధ్వజమెత్తారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై ముఖ్యమంత్రి అపోహలు సృష్టిస్తున్నారని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని మహిళల గౌరవాన్ని పెంచే చారిత్రక నిర్ణయం అని ఆయన తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ నిర్ణయాన్ని రాజకీయంగా చూడకూడదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టిందని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీనిపై రాజకీయాలు చేయకుండా, దేశంలోని 70 కోట్ల మహిళల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు కావని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం డీలిమిటేషన్ అవసరం ఉంటుందని చెప్పారు. దీనికి సమయం పడుతుందని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం తీసుకుంటుందని ఆయన వివరించారు. అందువల్ల అపోహలు సృష్టించకుండా, ప్రజలకు అసలైన సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

సిఎం వాదనలో శాస్త్రీయత లేదు: బండి సంజయ్

డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వాదనలో శాస్త్రీయత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ విమర్శించారు. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మా త్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని చెబుతారా? మీరు చెప్పిన ప్రాతిపదిక ప్రకారం, అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్‌కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలా? అని ఆయన ప్రశ్నించారు. మీరు పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడిన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు మూటలు పంపి డబ్బు ప్రాతిపదికనే సిద్దాంతాలు రచిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం ఇదేనా?, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్లకు సగం, జనాభా ప్రాతిపదికన మిగిలిన ప్రజలకు సగం సీట్లు ఇవ్వాలని చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే కాంగ్రెస్‌ను దేశం నుంచి బహిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచే వారన్నారు.

నేను రేవంత్‌రెడ్డిలా అవకాశవాదిని కాదు

తాను ఉత్తర భారత దేశానికి వలస వెళతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వలసపోవడానికి తాను అవకాశవాదిని కాదని, రేవంత్‌రెడ్డిని అంతకంటే కాదని ఆయన విమర్శించారు. తాను చచ్చినా బతికినా బిజెపిలోనే ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెం డానే అని ఆయన తెలిపారు. ఆ సన్నివేశం చూడడానికైనా రేవంత్‌రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని ఆయన చెప్పారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్‌ఏ ఉందన్నారు.

వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్‌రెడ్డి అని ఆయన విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజ్‌గిరి దాకా వలస పోయిం ది రేవంత్‌రెడ్డేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లును వ్య తిరేకించే మీరు కూడా తమను విమర్శిస్తారా? అని ఆయన ప్ర శ్నించారు. మీరు నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేద ని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎం దుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి ప్రశ్నించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments