Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedకాళేశ్వరం నివేదికపై తీర్పు వాయిదా

కాళేశ్వరం నివేదికపై తీర్పు వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రా జెక్టు అవకతవకలు, పిసి ఘోష్ కమిషన్ భ వితవ్యంపై ఉత్కంఠత కొనసాగుతోంది. దా ని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం వెల్లడించాల్సిన తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమయిన మేడిగడ్డి, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణం, నిర్వాహణలో అవకతవకలు జరిగాయని, వాటిని నిగ్గుతేల్చేందు కు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఏర్పా టు, దాని విచారణ ప్రక్రియ, నివేదికను స వాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సిఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గత కొన్నినెలలుగా ఈ పిటిషన్లపై వాదనలు సుదీర్ఘ జరిగాయి. మార్చి 12వ తేదీన దీనిపై వాదనలు పూర్తి కాగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

కాగా, కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం జీఓ నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను నియమించింది. దీనికి అనుగుణంగా కమిషన్ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులను విచారించి తుది నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి అందచేసింది. కమిషన్ నివేదికపై మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులు వేరు వేరుగా కోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తమపై అభియోగాలు మోపే ముందు, తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని వారు కోర్టుకు విన్నవించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. సెక్షన్8(బి), 8(సి) ప్రకారం నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడా సాక్షులతో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఎలాంటి విచారణ లేకుండానే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయకక్షలో భాగంగానే ఈ కమిషన్ ను వేశారని ఆరోపించారు. కాగా, ప్రభుత్వం తరపు న్యాయవాదనలు తమ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలికితీసేందుకే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కమిషన్ తన నివేదికను అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే సిద్ధం చేసిందని కోర్టుకు వివరించారు. విచారణలో భాగంగా పిటిషనర్లందరికీ నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారమే కమిషన్ ముందుకు వెళ్లిందని, ఈ పిటిషన్లను కొట్టివేయాలని ప్రభుత్వం తరపున కోర్టును కోరారు. ఈ క్రమంలో తుది తీర్పును ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం వాయిదా వేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠత ఈ నెల 22వ తేదీన తెరపడనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments