Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorized2029 వరకు జిల్లాల్లో మార్పుల్లేవ్

2029 వరకు జిల్లాల్లో మార్పుల్లేవ్

మన తెలంగాణ/ ఆదిలాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో 2029 వరకు జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చేయవద్దని కేంద్రం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలియజేశారు. అప్పటి వరకు జిల్లాల్లో ఎ లాంటి మార్పులు చేయలేమని స్పష్టం చేశారు. కేంద్రం ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ప్రజల ఆకాంక్షల మేరకు హ ద్దులు నిర్ణయిస్తామని ప్రకటించారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా పాలనప్రగతి బాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. విపక్ష ఎంఎల్‌ఎలను శత్రువులుగా చూసే ప్రభుత్వం మాది కాదని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలను సైతం ఆహ్వానిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు లేని నియోజకవర్గాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నామ ని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. రాజకీయాలు కేవలం ఎన్నికల వర కే పరిమితం కావాలని, అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా అందరినీ క లుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అ భివృద్ధిపై ప్రభుత్వ ఉక్కు సంకల్పాన్ని చాటారు.

కొమురం భీమ్ పోరాటస్ఫూ ర్తి ఉన్న ఈ నేలను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వా లు చేయని పలు వినూత్న నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలుచేస్తోందని ము ఖ్యమంత్రి వెల్లడించారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ  సౌకర్యం కల్పించామని, దీనిపై ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్లు వ్యయం చేశామన్నారు. మహిళలను ప్రయాణికులుగానే కాకుండా బస్సుల యజమానులుగా మారుస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయానికి హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రత్యేక విక్రయకేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.5,400 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని 3.17 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, పేదల ఆహారభద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ను అభివృద్ధి హబ్‌గా తీర్చిదిద్దుతాం

జిల్లా అభివృద్ధి దిశగా పలు కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర అనుమతులు సాధించామని తెలిపారు. వీలైతే జూన్ 2న శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో యూనివర్సిటీ స్థాపనకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని, భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద పునఃప్రారంభించి, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యం

బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రజల సేవే ధ్యేయం

తాము పాలకులం కాదని, ప్రజల సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రెండు నెలలకోసారి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షిస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ప్రజల ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 30,149 స్వయం సహాయక సంఘాలకు ఎస్‌హెచ్‌జీ రూ.53.50 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు.

ఎంపిక చేసిన ఐదుగురు లబ్ధిదారులకు (కిష్టయ్య, రాధ, భాగ్య, పద్మ, సుబ్బ) ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఉత్తమ పాలన కనబరిచిన 5 గ్రామ పంచాయతీలకు ఐఎస్‌ఓ ఐఎస్‌వో సర్టిఫికేషన్లను అందజేశారు. సీఎం కప్ స్టేట్ ఛాంపియన్‌షిప్ ఆదిలాబాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మట్, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, శాసనసభ్యులు పాయల శంకర్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments