Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedపాత గణాంకాలతో ఆరోపణలా?

పాత గణాంకాలతో ఆరోపణలా?

మన తెలంగాణ/హైదరాబాద్: కేరళం సిఎం పినరయి విజయన్ అసంబద్ధ ఆ రోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. వాస్తవాలు, అధికారిక గణాంకాలతో కేరళం సిఎం ఆరోపణలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. కేరళ సిఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలకు కౌం టర్‌గా సిఎం రేవంత్ రెడ్డి ఆరు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. కేర ళం అభివృద్ధి మోడల్లోని లోపాలను ఎ త్తిచూపుతూ 60 ఏళ్లలో జరిగిన అక్కడి అభివృద్ధికి పినరయి విజయన్, ఎల్డీఎ ఫ్ ప్రభుత్వం మాత్రమే కారణమని చె ప్పడాన్ని ఈ లేఖలో సిఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు, ఇక తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన సమగ్ర, సమ్మిళి త, సంపూర్ణ ప్రగతిని రేవంత్ రెడ్డి లేఖ లో వెల్లడించారు. తెలంగాణపై కేరళం సిఎం పినరయి విజయన్ చెప్పిన అ సంబద్ధ ఆరోపణలకు సంబంధించిన గణాంకాలన్నీ 202324 నాటివని, అవి తెలంగాణలో గత బిఆర్‌ఎస్ ప్ర భుత్వ పాలన  చివరి దశకు సంబంధించినవని సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలలు అయ్యిందని కేరళంలో విజయన్ సర్కారు 120 నెలలుగా అధికారంలో ఉందని, 70 ఏళ్ల కేరళం ప్రస్థానాన్ని తెలంగాణ 28 నెలల పాలనతో పోల్చడం ఆయన వంటి సీనియర్ లీడర్ స్థాయికి తగదని సిఎం రేవంత్‌రెడ్డి ఈ లేఖలో గుర్తు చేశారు.

ఈ చర్చకు రావాలని ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నా..

దశాబ్దాలుగా, యూడిఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాల హయాంలో ఆరోగ్యం, అక్షరాస్యత, పర్యాటక రంగాలలో కేరళం సాధించిన విజయాలను తాను ఎల్లప్పుడూ గుర్తించుకుంటానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక సీనియర్ నాయకుడిగా తాను మిమ్మల్ని గౌరవిస్తానని, మీరు ఒక సీనియర్ నాయకులని, అందులో భాగంగా నేడు తిరువనంతపురానికి తాను వచ్చి, తెలంగాణ ప్రభుత్వం 28 నెలల్లో సాధించిన విజయాలకు సంబం ధించిన సమాచారాన్ని మీకు తెలుపడానికి, వాస్తవపూరితమైన చర్చ జరపడానికి, ఈ చర్చలో మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి తాను సంతోషిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ చర్చకు తాను ఎంతో గౌరవంతో ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నానన్నారు. అదే సమ యంలో తాను కొన్ని విషయాలను స్పష్టంగా చెబుతున్నానన్నారు. కేరళం ప్రజలు అందమైన మలయాళీ భాషలో తనకు నేర్పిన మాటను, ఇప్పుడు తాను పూర్తి ఆప్యాయతతో మీకు చెబుతున్నానని ‘నీ పో, మోనే విజయన్’ అంటూ సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

పేదరికంపై నీతి ఆయోగ్ 2023-,24 గణాంకాల ప్రకారం

నీతి ఆయోగ్ వారి 2023,-24 ఎస్డీజీ సూచికలో కేరళ 79 పాయింట్లతో 1వ స్థానంలో నిలిచిందని విజయన్ చెప్పారని, అయితే, అది కేరళంలోని ఆరు దశాబ్ధాల ప్రభుత్వాల సమష్టి కృషి ఫలితమని, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలోని యూడిఎఫ్ కృషి కూడా ఎంతగానో ఉందన్న విషయాన్ని పినరాయి విజయన్ గుర్తించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో సూచించారు. అదే సమయంలో తెలంగాణ 6వ స్థానంలో ఉందని ప్రస్తావించి, పోల్చి చెప్పడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వాల పరిపాలన వల్లే..

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వాలు 60కి పైగా సంవత్సరాలుగా సాగించిన పరిపాలన ఫలితంగానే కేరళంలో పేదరికం తక్కువ కావడానికి దోహదపడిందని ఆయన తెలిపారు. అలాగే, గల్ఫ్ దేశాల నుంచి భారీ మొత్తంగా వచ్చిన విదేశీ మారక ద్రవ్యాల (నగదు) ప్రవాహం సమష్టి ఫలితంగా కేరళంలో పేదరికం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి కేవలం 12 సంవత్సరాలే అయ్యిందని, అందులోనూ దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బిఆర్‌ఎస్, కేంద్రంలో బిజెపిలు సంయుక్తంగా సృష్టించిన ఆర్ధిక విధ్వంసం కారణంగా రాష్ట్రంలో 5.88 శాతం పేదిరికం నమోదయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు.

అక్షరాస్యత విషయంలో తెలంగాణను తక్కువ చేసి చూపించి..

అక్షరాస్యత విషయంలో తెలంగాణను తక్కువ చేసి చూపేందుకు కేరళం అక్షరాస్యత రేటు 95.3 శాతం, తెలంగాణలో 76.9 శాతం అని విజయన్ ఉదహరించారని, కానీ, ఈ పోలిక చేసేటప్పుడు రెండు ప్రాంతాల భౌగోళిక, చారిత్రక, జనాభా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో తెలిపారు. కేరళంలో దాదాపు సార్వత్రిక అక్షరాస్యతకు కారణం కేవలం విజయన్ సర్కారు మాత్రమే కారణం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. దాదాపు 1800 సంవత్సరం ముందు నుంచే విద్యకు ట్రావెన్‌కోర్, కొచ్చిన్ సంస్థానాలు ప్రాధాన్యతను ఇచ్చాయన్నారు.

తెలంగాణలో శిశు మరణాల రేటు గణనీయంగా..

శిశు మరణాల రేటుపై ప్రతి 1,000 జననాలకు కేరళంలో శిశు మరణాల రేటు కేవలం 5 మాత్రమేనని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలోని 5.6 కంటే మెరుగయ్యిందన్న వాదన వాస్తవాలను వక్రీకరించడం కిందకు వస్తుందని సిఎం రేవంత్ తెలిపారు. విజయన్ ఉదహరించిన అమెరికా గణాంకాలు మొత్తం దేశానికి సంబంధించినవని, అది అత్యంత అసమానతలు గల, భీమా ఆధారిత వ్యవస్థ గల దేశంతో పోల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇక మన దేశంలో, తెలంగాణలో కూడా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు.

కేరళం వ్యవస్థలను ఎప్పుడూ అపహాస్యం చేయలేదు

కేరళం డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థ ‘ఎంతే భూమి’ని అధ్యయనం చేయడానికి, తెలంగాణ రెవెన్యూ, సర్వే బృందం సెప్టెంబర్ 16, 2025న తిరువనంతపురాన్ని సందర్శించిందని విజయన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ భూ దందాలను నిలువరించేందుకు భూమాత తీసుకువచ్చామని అందుకోసం ప్రజా ప్రభుత్వ బృందం కేరళం, సింగపూర్, అన్ని చోట్ల నుంచి ఉత్తమమైన వాటిని అధ్యయనం చేసిందని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో తెలిపారు. కొత్త విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదని అందుకు ప్రజా ప్రభుత్వం ప్రతినిధిగా గర్వపడుతున్నానని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ నమూనా అని, నేర్చుకోవడం, స్వీకరించడం,

అమలు చేయడమే తమ లక్షమని ఆయన అన్నారు. తాము కేరళం వ్యవస్థలను ఎన్నడూ అపహాస్యం చేయలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. దేవుని సొంత ప్రదేశంగా గుర్తింపు పొందిన కేరళంలో శబరిమల బంగారు కుంభకోణాన్ని పినరయి విజయన్ సర్కారు సమర్థించడం గమనిస్తుంటే విజయన్ ప్రభుత్వ కపటత్వ వైఖరి స్పష్టంగా తెలుస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. సిఎంగా విజయన్ ఉన్నప్పుడు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారాన్ని దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయని, దానిపై కేంద్ర విచారణ సంస్థలు ఎటువంటి విచారణ చేయకపోవడం బిజెపి, ఎల్డీఎఫ్ రహస్య సంబంధం ఏమిటో తెలుస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ఆరోపించారు.

జీతాలు, పెన్షన్ల జాప్యంపై విజయన్ అబద్ధపు ముచ్చట్లు

జీతాలు, పెన్షన్ల జాప్యంపై విజయన్ అబద్ధపు ముచ్చట్లు మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. జీతాల జాప్యం అనేది గత బిఆర్‌ఎస్ ఆర్థిక విధ్వంసం కారణంగా జరిగిందని ఆయన తెలిపారు. 25 నెలల క్రితం, మార్చి 2024 నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments