
మనతెలంగాణ/హైదరాబాద్:దేశంలోనే అద్భుతమైన వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కలిగిన హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు జై కొడుతున్నాయి. ఇదివరకు ఐటీ కంపెనీలు, బయో సంబంధిత సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఆసక్తి చూపగా, తాజాగా విద్యా సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పె ట్టేందుకు క్యూ కడుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన 13 ప్రఖ్యాత పాఠశాలలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ మేరకు యూకే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ అందింది. అందులో భాగంగా యూకే డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు (మార్చి 18వ తేదీ న) రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా స్థానిక ఉన్నతాధికారులతో యూకే ప్రతినిధులు కీలక సమాలోచనలు జరుపనున్నారు. రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ మేరకు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలోకి ఆహ్వానించేందుకు ప్రజా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో 13 యూకే స్కూళ్లకు సంబంధించిన రిప్రజేంటెటివ్స్, యూకే ప్రభుత్వ అ ధికారులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలోకి రానున్న ప్రైవేటు విద్యా సంస్థలు, కేజీ టు ప్లస్ 2 కరికులం లో అగ్రగామిగా పేరొందాయి. స్థానికంగా విద్యా శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖలు మున్సిపల్, విద్య, ఐటీ, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అ థారిటీకి చెందిన అధికారులు చర్చించనున్నారు. ఈ విషయంలో మ రింత సమన్వయం, యూకే విద్యా సంస్థలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే వాటికి ఏ విధమైన టైమ్‌లైన్‌ను నిర్దేశించుకొని వెళ్లాలో చర్చలు సాగనున్నాయి. అయితే, యూకెకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు సైతం తెలంగాణలో వారి క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలన్నీ ఒక కీలక దశకు చేరుకున్న విషయం తె లిసిందే. ఈ క్యాంపస్‌లు ఎక్కడ పెట్టాలన్న దానిపై తెలంగాణ ప్రభు త్వ ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చలు చేస్తున్పటికీ, మరోవైపు భార త్ ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ప్రత్యేకంగా ఒక ఎడ్యుకేషన్ జోన్‌లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగులు పడుతున్నాయి.




