
న్యూఢిల్లీ/సిద్దిపేట ప్రతినిధి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను సోమవారం ప్రకటించా రు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, విద్యావే త్త నందిని సిధారెడ్డికి, అని మేష కవితా సంకలన సృష్టికి గుర్తింపుగా దక్కింది. 2025 పురస్కారాల కు పలు భారతీయ భాషల 24 మంది కవులు, ర చయితలకు పురస్కారాలు బహుకరిస్తారు. అవా ర్డు పొందిన వారిలో ఆంగ్ల రచయిత , మాజీ రాయబారి నవ్‌తేజ్ సర్నా, హిందీ నుంచి మమత కాలియా ఉన్నారు. సర్నాకు ఆయన రాసిన నవల క్రింప్సన్ స్పింగ్‌కు , కా లియాకు ఆమె రాసిన జ్ఞాపిక జీతే జీ అలహాబాద్‌కు ఈ అవార్డు ప్రకటిం చారు. పలు సాహితీ ప్రక్రియల్లో విశిష్ట రచనలను ఎంపిక చేసుకుని ఏటా జాతీయ సాహిత్య పుర స్కారాలు ప్రకటిస్తారు.
ఈ క్రమంల 24 భారతీ య భాషలకు చెందిన నవలలు, కథ లు, వ్యాసా లు, కవితా సంకలనాలకు విమర్శలకు ఇతర ప్రక్రియలకు పురస్కారాలను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. తమిళంలో సా తమిళ్‌సెల్వన్, రాజస్థానీలో జితేందర్ కుమార్ సోనీ, ఉర్దూ నుంచి ప్రీత్‌పాల్ సింగ్ బేతాబ్, కన్నడంలో అమ్రేష్ నూగాడోనిలకు అవార్డులు ప్రకటించారు. పురస్కార విజేతలకు రూ 1 లక్ష నగదు, కాంస్య ఫలకం, శాలువా బహుకరిస్తారు. పురస్కారాల ఎంపిక జ్యూరీలో సాహితీవేత్తలు మధురాంతకం నరేంద్ర, ఆచార్య ఎన్ గోపీ, డాక్టర్ కె కోటేశ్వర రావు ఉన్నారు.
అనిమేషలో వర్తమాన మానవ ఇతివృత్తం
కరోనా ఉపద్రవంపై అక్షర హెచ్చరిక
కవి నందిని తమ అనిమేషను తన సాహితీ ప్రస్థాన క్రమంలో పరిణతి స్థాయిలో ఆవిష్కరించారు. మనకు మనమే సృష్టించుకుంటున్న విలయాన్ని ప్రస్తావించారు. మనిషి తనకు తాను ప్రత్యేకం సొంతం అని కాకుండా, ప్రకృతి తనకోసం అని భావించకుండా, ప్రకృతితోనే తానూ అని మొదలలాని చెపుతారు. ప్రత్యేకించి మనిషికి ప్రకృతి నాశనం ద్వారా సంక్రమించే ఉపద్రవాలను విశ్లేషించారు. బాధ్యతాయుత కవిగా మనిషి పర్యావరణం పట్ల ఏ విధంగా వ్యవహరించాలనేది చెపుతాడు. ప్రకృతి విధ్వంసంతో ఆవిర్భవిస్తున్న సజీవ, నిర్జీక కణజాలాలు ఎంతటి విధ్వంసాన్ని మనిషికి కల్గిస్తున్నాయనేది అనిమేషలో చర్చించారు. తలెత్తుతున్న ఉపద్రవాలకు ఎవరు కారకులు? ఏది పరిష్కారం అనేది తనదైన రచనాశైలితో ఉటంకించారు. ఉపద్రవం నుంచి ఉపశమనం దాకా 19 పర్వాల కవితా సంకలన రచన సాగింది.
విద్యార్థి దశ నుండే సాహిత్యంపై మక్కువ
డాక్టర్ నందిని సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం..1955 డిసెంబర్ 6 న ఆయన జన్మించారు. తండ్రిపేరు బాలసిద్ధారెడ్డి, తల్లిపేరు రత్నమాల.భార్య పేరు మల్లీశ్వరీ. కూతురు వీక్షణ..ప్రాథమిక విద్య బందారం, వెల్కటూరు, దుద్దెడ, ఉన్నత విద్య సిద్దిపేటలో చదివారు.. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసించారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఏ, తెలుగు పిజి విద్యను పూర్తి చేశారు.ఆధునిక తెలుగు కవిత్వంలో సూ ర్యుడు అనే అంశం పై 1981 లో ఎంఫీల్ చేశారు. ఆధునిక కవిత్వం – వాస్తవికత – ఆదివాస్తవికత అనే అంశం పై ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి డాక్టరేట్ పట్టా పొందారు.. ప్రభుత్వ డిగ్రీ కాళాశాల లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి మెదక్, సిద్దిపేట డిగ్రీ కళాశాలాల్లో తెలుగు లెక్చర్ గా పనిచేశారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ గా కొంత కాలం పనిచేశారు. తెలంగాణ ఉద్యమం లో భాగస్వామి అయ్యేందుకోసం ప్రిన్సిపాల్ బాధ్యతల నుండి తప్పుకొని తిరిగి సిద్దిపేట డిగ్రీ కళాశాల కు లెక్చరర్ గా బాధ్యతలు చేపట్టి మరోవైపు తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారు..ఆయన సిధారెడ్డి తండ్రి బాల్ సిధారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించాడు.
కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలిగిన తండ్రి బాల్ సిధారెడ్డి ప్రభావం నందిని సిధారెడ్డిపై పడింది.. ప్రాథమిక విద్యార్థి దశనుండే సిధారెడ్డి కి సాహిత్యం పై ఆసక్తి పెరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పద్యకవిత్వం పై ఆసక్తి పెంచుకొని పద్య సాహిత్య సృజన చేశారు.. బాల్య దశలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి పై మల్లిఖార్జున శతకం అనే శతకపద్యాలు రాశాడు.. అది అచ్చుకాలేదు. తర్వాత తెలుగు ఉపాధ్యాయుడు అష్టకాల నరసింహ స్వామి ప్రోత్సహం తో వచన కవిత్వం పై ద్రుష్టి మల్లించాడు. యాభై ఏళ్లుగా ఆయన సాహిత్య సృజన చేస్తూ సామాజిక సృ్పహ తో వచన కవిత్వం రాశారు. 2001 లో సిద్దిపేట కు చెందిన నేత కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టిఆర్ ఎస్ ను ప్రారంభించి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించారు.. తెలంగాణ ఉద్యమం కోసం 1997 సంవత్సరం లోనే పాటలు రాశారు. కేసిఆర్ తో కలిసి సాంసృ్కతిక ఉద్యమం లో భాగస్వాములను చేశారు..
ప్రసంగాలు చేశారు వ్యాసాలు రాశారు, సాహిత్యం సాహిత్యం సృజించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నందిని సిధారెడ్డి సాహిత్య కృషిని గుర్తించి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ గా నందిని సిధారెడ్డి సమర్థవంతంగా పనిచేశారు. అనేక పుస్తకాలను ప్రచురించిప జేశారు.. కేసిఆర్ సారధ్యం లో నందిని సిధారెడ్డి నేతృత్వం లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో నాభవిష్యతి అన్న పద్ధతి జరిగాయి. నిజాయితీ.. నిబద్ధత, నమ్మిన సిద్ధాంతం పట్ల పూర్తి స్థాయిలో ఆచరణ లో చూపించే నందిని సిధారెడ్డి ముక్కు సూటి వ్యక్తిత్వం కలవారు. తన నిబద్ధతను చాటుకున్నారు. నందిని సిధారెడ్డి 50 ఏండ్ల సాహిత్య ప్రస్థానం. ఆయన సాహిత్య కృషి, కరోనా కాలం లో ఆయన రాసిన అనిమేష అనే దీర్ఘ కవితా సంపుటిని రాశారు.. ఆసమయం లో ప్రజల జీవన స్థితి గతులను ప్రతిబింబిస్తూ రాసిన ఈ సంపుటికి కేంద్ర సాహిత్య ఆకాడమీ పురస్కారం లభించింది. నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల మాజీ సిఎం కేసిఆర్ , బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు కె. రంగాచార్య, ప్రధాన కార్యదర్శి సిద్దెంకి యాదగిరి..మరసం కవులు హర్షం ప్రకటించారు.




