Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedఆరుగురు ఎమ్మెల్యేలపై సిఎం ఆగ్రహం

ఆరుగురు ఎమ్మెల్యేలపై సిఎం ఆగ్రహం

మనతెలంగాణ/హైదరాబాద్:చిట్‌చాట్‌లు మానే సి సభకు ప్రిపేర్ అయి రావాలని సొంత పార్టీ ఎ మ్మెల్యేలకు సిఎం రేవంత్‌రెడ్డి క్లాస్ తీసుకున్నారు. సిఎల్పీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని ఆయన ఎ మ్మెల్యేలకు హెచ్చరించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావే శం జరిగింది. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సం దర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అ సెంబ్లీ స మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ హాంపై సభ్యులకు సిఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని,

తాను టైమ్ ఇస్తానని, ఎమ్మెల్యేలు సమస్యలపై స్పందించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సీఎల్పీ సమావేశానికి ఆరుగురు సభ్యులు ఎందు కు రాలేదని సిఎం ఆరా తీశారు. సీఎల్పీకి రాలేనంగా బిజీగా ఎమ్మెల్యేలు ఉన్నారా అని సిఎం రే వంత్ ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే స రే కానీ, అవకాశం ఉండి కూడా రానివారి తీరుపై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్ మస్ట్‌గా ఉండాలని, అందరూ కంటెంట్‌పై అవగాహనతో రావాలని సిఎం సూచించారు. సభలో మాట్లాడే అంశాలపై ప్రభుత్వ విప్‌ల మధ్య సమన్వయం ఉండాలని సిఎం ఆదేశించారు. సభలో మాట్లాడే అంశాల మధ్య సమన్వయం ఉండాలని సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలని సిఎం సూచించారు.

అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తాం

గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టాలని సిఎం పేర్కొన్నారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా చూడాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సమయం ఇవ్వలేదని, భట్టి, జానారెడ్డికి కనీసం మైక్ ఇవ్వలేదని సిఎం గుర్తు చేశారు. నాడు తనను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సిఎం హెచ్చరించారు. మహిళా శాసనసభ్యుల హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని సిఎం చెప్పారు. పూర్తి స్థాయిలో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని, ఇక మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామన్న దానిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారని ఆయన చెప్పారు.

వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేయాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదని ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందని తెలిపారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇది మన ప్రభుత్వం, ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్ వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుందన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై సభ్యులు ఫోకస్ పెట్టాలని, 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి: పిసిసి

బడ్జెట్ సమావేశంలో సభ్యులు సకాలంలో విధిగా సభలకు హాజరు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. సీఎల్పీ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు దీటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన విధంగా సమాధానాలు ఇవ్వాలన్నారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను మంత్రులు ధీటుగా తిప్పికొట్టాలని ఆయన సూచిం చారు. మన ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లెక్కలతో సహా ప్రజలకు అర్థం అయ్యే విధంగా చెప్పాలని, అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి అందరూ సభ్యులు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments