Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedసుందరీకరణ ముసుగులో భూముల ఆక్రమణ

సుందరీకరణ ముసుగులో భూముల ఆక్రమణ

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అ న్నారు. మూసీ బాధితులు సమిష్టిగా రెండేళ్లు కలిసికట్టుగా ప్రభుత్వంపైన పోరాడితే తమ ప్రభు త్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రా జ్యాన్ని పారదోలి ప్రతి ఒక్కరి ఇళ్లను భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ వేదికగా శనివారం కెటిఆర్ ‘ముసీ పునరుజ్జీవం – పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కిలోమీటర్ల మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని వివరించారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ వి ధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు. ఎ లాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా, సో షల్ ఇంఫాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు,

ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేలమంది ఇండ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తుంద ని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టాలను, ఇతర నిబంధనలను అన్నింటినీ పాతరేసి వేలకోట్ల అవినీతికి తెగబడుతున్నదని విమర్శించారు. అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదు అని, అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహాని కి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పరంగా పెట్టి వందల ఉద్యమాలు చేసి సాధించుకున్న భూమి పుత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామని తెలిపారు. బాధితుల వెంట బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని, ప్రతి ఒక్క ప్రాంతానికి పార్టీ నేతలు, శ్రేణులు వచ్చి మరి నిలబడతామని భరోసా ఇచ్చారు.

మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు

అందాల పోటీలకు ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ రెడ్డి తీరు తయారైందని కెటిఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారని అన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ పిపిటి ప్రజంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పిపిటి ఇచ్చారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే, మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన తాము వివరిస్తున్నారని చెప్పారు.

ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వం ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్‌రెడ్డి పాపాన్ని కడుక్కోవాలని అన్నారు. నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు అని, వందల కిలోమీటర్ల నమామి గంగేకి అంత ఖర్చు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే తమ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమని, కానీ మూసీ పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

ఎవరూ అడ్డుకోవద్దని గాంధీ విగ్రహం పెట్టే కుట్ర

రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుండా, మూసీ పక్కన ఉన్న భూముల కోసం పనిచేస్తున్నట్లు ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేమిటి రేవంత్‌రెడ్డి అంటున్నారని అన్నారు. గాంధీ విగ్రహం పెడతా అంటున్న రేవంత్ రెడ్డి, గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ మూసీలో దోపిడీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మూసీ అంశంలో తమ పార్టీది మానవీయ కోణంలో అభివృద్ధి చేసే కార్యక్రమం అని పేర్కొన్నారు. తాము మూసీలో ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా నాగోల్ వద్ద అభివృద్ధి చేశామని, దీంతోపాటు బేగంపేట, గండిపేట వంటి అనేక చోట్ల అభివృద్ధి చేశామని వివరించారు. కానీ, కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామని అన్నారు. ఎలాంటి పని చేయకుండానే మూసీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. ప్రజల ఇళ్లను కూగొట్టాలని తమ పార్టీ ఏనాడు మూసి అభివృద్ధి ప్రణాళికలో భావించలేదని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇండ్లను కూలగొట్టి మూసి ప్రణాళికను తయారు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇండ్లను కూల్చి వాటి పునాదుల పైన మూసి ప్రాజెక్టు కట్టడం అన్యాయం అని మండిపడ్డారు.

మూసీ అభివృద్ధిలో భాగంగా మూసీకి ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో పాటు, మూసీలో మురికిని మొత్తం తీసివేసేలా ఎస్టీపీల నిర్మాణాన్ని కోసం ప్రణాళిక రూపొందించి, ఆ మేరకు 3,800 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని కెటిఆర్ తెలిపారు. వీటి నిర్మాణం పూర్తి అయితే ఒక్క చుక్క కూడా మురికి నీరు మూసిలోకి చేరదు అని పేర్కొన్నారు. దీంతోపాటు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దానికోసం కేవలం 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకు వచ్చే అవకాశం ఉందని, కానీ ఇదే కార్యక్రమానికి అనేక రెట్లు అంచనాలు 10 వేల కోట్లకి పెంచి రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా కరప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరద నీటిని అడ్డుకోవడం కోసం ఎస్‌ఎస్‌డిపిఅనే ఒక ప్రత్యేక పథకాన్ని కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. దీంతోపాటు మూసీలో చెక్ డ్యామ్‌లు, మూసీ పైన బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు పార్కులు ఇలా అన్నింటిని గత ప్రభుత్వ ప్రణాళికలో పొందుపరిచామని వివరించారు. ఇవన్నీ కలిపి సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం కేవలం రూ.16,000 కోట్ల మాత్రమే అని పేర్కొన్నారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి లక్షల కోట్ల రూపాయల ఖర్చు మూసీ పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

బఫర్ జోన్ పేరు చెప్పి సర్కార్ ఇళ్లను కూలుస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. కేవలం డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్‌లో ఉన్నది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వాళ్ళ సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్‌లో ఉందని, మంత్రుల ఫామ్ హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నా ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్‌లను, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్‌లను మాత్రం ముట్టుకోనని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉన్న వాటిని కూలగొట్టి తిరిగి అవే బఫర్ జోన్‌లో భారీ భవనాలు కడతా అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,300 ఎకరాల భూమి పైన కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లు అని, ఆ భూముల కోసమే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఒక్క డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవాలని తెలిపారు. జీరో విలువ మూసీ బాధితుల ఇళ్లకు ఉందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎవరికైనా జీరో విలువ ఉన్నది అంటే అది ముమ్మాటికీ రేవంత్ రెడ్డికే అని కెటిఆర్ విమర్శించారు. కేవలం ఒకటి రెండు అపార్ట్‌మెంట్ వాసులకు ఇళ్లు కట్టించి తగిన స్థలం ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, అదే సూత్రం అదే న్యాయం బాధితులందరికీ వర్తింపజేస్తారా.. అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి తన కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంతో అనే అంశం పైన అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎవరికీ నష్టం లేకుండా మూసీని అభివృద్ధి చేసే గత ప్రభుత్వ ప్రణాళిక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదని, దాన్ని చూసి తక్కువ ఖర్చుతో మూసీని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. కేవలం రూ.16,000 కోట్లతో 57 కిలోమీటర్ల మూసీని అభివృద్ధి చేయవచ్చని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మూసి బాధితులు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల పైన ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. దశాబ్దాల నుంచి స్థిరపడి జీవనం సాగిస్తున్న మా బతుకులను ఆగం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్,లక్ష్మారెడ్డి, ఎంఎల్‌సి శంబీపూర్ రాజు, బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments