Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedతమిళ కవి వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు

న్యూఢిల్లీ: ప్రముఖ తమిళకవి, గీత రచయిత వైరముత్తు రామసామికి సాహిత్య ప్రతిష్టాత్మక 2025 సంవత్సరపు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించారు. తన పాటలతో , నవలలతో రచనలతో సృజనాత్మక గాఢత, విశిష్ట, విభిన్న కవితా విలువలను చాటినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర భారతీయ జ్ఠానపీఠం శనివారం ఈ 60వ జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రముఖ రచయిత ప్రతిభారాయ్ సారధ్యపు సంబంధిత కమిటీ జరిపిన సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. కమిటీలో ప్రముఖ మేదావులు, సాహితీవేత్తలు మాధవ్ కౌశిక్,

దామోదర్ మౌజో, సురంజన్ దాస్, ఎ కృష్ణారావు , ప్రఫుల్లా శైలేదర్, కేశూభాయ్ దేశాయ్, జానకి సభ్యులుగా ఉన్నారు. పురస్కార విజేతకు రూ 11 లక్షల నగదు , వాగ్ధేవి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం బహుకరిస్తారు. 72 సంవత్సరాల వైరముత్తు పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. వైరముత్తు తమిళ సినిమా పాటలు అనేకం తెలుగులో డబ్ అయ్యాయి. రోజాలో చిన్ని చిన్ని ఆశ ఆయన మాతృక పాట నుంచి వెలువడిందే. తమిళనాడుకు జ్ఞాన్‌పీఠ్ దక్కడం ఇది మూడోసారి.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments