
మన తెలంగాణ/ఘట్‌కేసర్: మరదలు పెళ్లి చేసుకోన ని చెప్పడంతో ద్వేషం పెంచుకున్న మేనబావ బలవంతంగా ఎయిడ్స్ రక్తంతో కూడిన ఇంజెక్షన్‌ను ఎక్కించిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పోచారం డివిజన్ అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన కె.మనోహర్ (25) నగరంలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సమీప బంధువైన యువతితో గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం నిశ్చయమైంది. అయితే మనోహర్‌కు ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేశా రు.దీంతో ఆగ్రహం చెందిన మనోహర్ యువతిని పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేశాడు. ఈ క్ర మంలో ఈ నెల 11న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లి మరోసారి పెళ్లి విషయ మై వాగ్వాదానికి దిగాడు.
యువతి తిరస్కరించడం తో ఆగ్రహానికి లోనైన మనోహర్ ముందుగా తెచ్చుకు న్న ఎయిడ్స్ సోకిన రక్తంతో ఉన్న ఇంజెక్షన్‌ను ఆమె కు బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాతి రోజు యువతికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా చేతిపై ఇంజెక్షన్ గుర్తులు కనిపించడంతో వివరాలు అడగగా యువతి జరిగిన విషయం తెలిపింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మనోహర్ తల్లిదండ్రులకూ ఎయిడ్స్ ఉన్నట్లు, అదే వ్యాధితో అతని తండ్రి మృతిచెందినట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.




