Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedఫైనల్ లో ఘన విజయం.. టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్‌

ఫైనల్ లో ఘన విజయం.. టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్‌

టీ20 ప్రపంచ కప్‌ 2026 విజేతగా భారత్ నిలిచింది. దీంతో మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 96 పరుగుల భారీ తోడాతో విజయాన్ని అందుకుని.. వరుసగా రెండోసారి కప్ ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్లు అభిషేక్ శర్మ(52), సంజూ శాంసన్(89), ఇషాన్ కిషన్(54)లు విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగారు. చివర్లో శివమ్ దూబే(26 నాటౌట్) భారీ షాట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments