Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedహెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్‌లో 48 మంది పిల్లలు బలి

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్‌లో 48 మంది పిల్లలు బలి

దుబాయ్: హెజ్‌బోల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య పోరులో వారం రోజుల్లో మొత్తం 400 మంది చనిపోయారు. వీరిలో 48 మందికి పైగా బాలలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తమ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం దశలోనే లెబనాన్‌లో బలీయంగా ఉన్న హెజ్‌బోల్లా వర్గాలను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ సేనలు (ఐడిఎఫ్) బీకర దాడులకు దిగుతోంది.

పౌర ప్రాంతాల్లో దాడులతో రక్తపాతం జరుగుతోంది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో నిర్ణీత లక్షాలను ఎంచుకుని లెబనాన్‌లో ప్రభుత్వ వర్గాలకు కట్టుబడకుండా ఉండే మిలిటెంట్లు రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం తమ దాడులను తీవ్రతరం చేసింది.బీరూట్ ఇతర ప్రాంతాల్లో పలు ఆసుపత్రులలో గాయపడ్డ వారికి చికిత్సలకు అవసరం అయిన ఏర్పాట్లు లేకపోవడంతో దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సంకట స్థితిని ఎదుర్కొంటోంది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments