Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedరూ.18వేల కోట్లు హ్యామ్‌ఫట్

రూ.18వేల కోట్లు హ్యామ్‌ఫట్

మన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్(హెచ్‌ఎ ఎం) రోడ్ల పేరిట రాష్ట్రంలో సుమారు రూ.18వేల కోట్ల స్కాంకు తెరలేపారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్‌అండ్‌బి)లో రూ.12వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6వేల కోట్లు కలిపి భారీ స్థాయి లో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారని, ఇప్పుడు అదే ప్రభుత్వం 10శాతం మొబిలైజేషన్ ఇస్తోందని పేర్కొన్నారు. ఇందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చు కోసం పంపబోతున్నారని, ఈ వ్యవహారం పెద్ద స్థాయి స్కాంగా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని..కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని..తేడా 50 శాతం వస్తోందని తెలిపారు.

ఈ టెండర్లకు సిఒటి అనుమతి కూడా అవసరం లేకుండా, శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కుతో 20 నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు టెండర్లు వేయించారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజల డబ్బును కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల విధానాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే… ఇప్పుడు పది శాతం పెట్టారని అన్నారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని ఆరోపించారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖలోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చని చెప్పారు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని,

నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని అన్నారు. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి,ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని, రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని తెలిపారు. టెండర్లలో కుమ్మక్కు అయ్యారని, సివేట్, సరళ, బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్క్‌లు సివేట్‌కు 3 వర్కులు జె ఇన్‌ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్‌కు 5 శాతం సీలింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాక్సెస్ ఎత్తివేశారని తెలిపారు. టెండర్లలో అవినీతి జరిగిందని, ఆ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు,

రిజర్వ్ బ్యాంకుకు, అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడింంచారు. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేసి, పారదర్శంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఒటి అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలని, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు రద్దు చేయాలని అన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి పద్దులు చర్చకు వచ్చినపుడు బిఆర్‌ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామని, హైకోర్టు విచారణకు పట్టుబడతామని వెల్లడించారు. సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని తాము బయటపెట్టిన తర్వాత తక్కువకు పోయిందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments