Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedమొయినాబాద్ డ్రగ్స్ కేసు..విచారణకు సిట్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు..విచారణకు సిట్

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: రంగారెడ్డి జి ల్లా మొయినాబాద్‌లోని బీఆర్‌ఎస్ నేత పైలట్ రో హిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నే తృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కేసును విచారణ చేయడానికి 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేయనున్నట్లు తెలిపింది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలు తదితర అంశాలపై సిట్ విచారణ జరపనుంది. మరోవైపు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

నిందితులను కస్టడీకి ఇవ్వండి : పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్‌రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సిట్ సిఫారసు చేసింది. ఫామ్‌హౌస్‌లో సోదాలకు వెళ్లిన పోలీసులపై రియల్టర్ నమిత్ శర్మ, రితేశ్ రెడ్డి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. తుపాకీ లైసెన్స్ దుర్వినియోగం చేశారని సిట్ అధికారులు సీపీకి లేఖ రాశారు. మరోవైపు ముగ్గురు నిందితులను 7 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో ఈ నెల 14న రాత్రి జరిగిన విందుపై తెలంగాణ ఈగల్, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్, మద్యం పార్టీకి ప్రధాన సూత్రధారిగా తేలింది. కొన్నిరోజులుగా రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో వారాంతపు పార్టీ చేద్దామనే గట్టి ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి బిజినెస్ మీటింగ్‌లో భాగంగా శిమ్లా వెళ్లినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.15 వేలకు కొకైన్‌ను కొనుగోలు చేశాడు.

పార్టీలో మొత్తం 11 మంది : ఈ విషయం పైలట్ రోహిత్ రెడ్డితో చెప్పగా ఈ నెల 14న సాయంత్రం తన ఫాంహౌస్‌లో పార్టీ చేద్దామనే ఆలోచనకు వచ్చి నిర్ణయించుకున్నాడు. దీనికి తన స్నేహితుడు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తో సహా ఇతరుల్ని ఆహ్వానించాడు. కౌశిక్ రవి డ్రగ్స్‌తో నేరుగా ఫాంహౌస్‌లో జరిగే పార్టీకి వచ్చాడు. మొత్తం 11 మంది పాల్గొన్న పార్టీలో మహేశ్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ తదితరులంతా మద్యంలో కొకైన్(డ్రగ్స్) కలిపి సేవించారు.

గన్‌తో శర్మ కాల్పులు : ఈ ఫాంహౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ కేసులో ఒక్కోక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాంహౌస్‌లోకి పోలీసులు రావడాన్ని చూసిన నమిత్‌శర్మ తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతోనే గన్‌తో కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఫాంహౌస్‌లోకి ప్రవేశించే సమయంలోనే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో తాము ఫ్యూచర్‌సిటీ పోలీసులమని, పక్కా సమాచారంతో సోదాలకు వచ్చామంటూ వారు గట్టిగా చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా నమిత్ పోలీసు అధికారిని టార్గెట్‌గా చేసుకుని ఒక రౌండు కాల్పులు జరిపాడు. పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి ఇద్దరూ వాళ్లను కాల్చెయ్, తర్వాత మొత్తం మేం చూసుకుంటాం అంటూ నమిత్ శర్మను రెచ్చ గొట్టినట్లు సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అప్రమత్తతతో అందర్నీ చుట్టుముట్టడంతో తుపాకీ కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితేశ్ రెడ్డిపై కొత్తగా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లను జోడించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో వీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు ఎవరు? వారికి మీకు ఉన్నా లింకులు, దుబాయ్ లింకులు తదితర అంశాలపై పలు కోణాల్లో విషయాలను రాబట్టేందుకు ఈ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సిట్ నివేదికను అందించనుంది. మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌పై ఆదివారం పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సమయంలో న్యూఢిల్లీకి చెందిన నమిత్ శర్మ.. కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని చుట్టిముట్టారు. ఈ సందర్భంగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. వారిలో పలువురికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సైతం ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అలాగే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి వారి వారి పార్టీల నుంచి నోటీసులు అందాయి. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నాయి.

పలు అంశాలపై ఆరా : రోహిత్ రెడ్డి పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారు? డ్రగ్స్‌తో పాటు అసలు ఫాంహౌస్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? గతంలో ఎవరైనా ప్రముఖులు ఇక్కడికి వచ్చారా? వస్తే వారికి ఎలాంటి పార్టీ ఇచ్చారు? ఇదే తరహాలో ఎన్ని పార్టీలు జరిగాయి? అన్న కోణంలో సిట్ విచారణ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ దందాతో పాటు దుబాయ్‌కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అన్న లింకులపైనా సిట్ బృందం ఫోకస్ చేయనుంది. సిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments