
మన తెలంగాణ/కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో సోమవారం ఆర్ధరాత్రి హవాలా డబ్బు కలకలం సృష్టించింది. రూ.కోటి నగదుతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులను నిందితులు సినీ ఫక్కీలో వెంటాడి కూకట్‌పల్లి పిల్లర్ నెం.837 వద్దకు చేరుకోగానే కళ్లలో కారం కొట్టి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది సంఘటను గుర్తించేలోగా నిందితులు పారిపోయారు. బాధితుడు మహమ్మద్ అజీముద్దీన్‌ను కూకట్‌పల్లి సిఐ వద్దకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు బాలానగర్ సిసిఎస్ తో సమన్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా 24 గంటలు కూడా గడవక ముందే అందులోని ప్రధాన నిందితులైన
నలుగురుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదును, విమానం టికెట్లను, సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురిని పట్టుకోగాకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిపి రితిరాజ్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలోగల సిద్రా ఎంటర్‌ప్రైజెస్ యజమాని వివిధ వ్యక్తుల నుంచి నగదు వసూలు చేయడానికి ఖుసృద్ధీన్ అతని సహ ఉద్యోగి అయిన మహమ్మద్ అజీముద్దీన్ (ఫిర్యాదుదారుడు) ను నియమించాడు. టోకెన్ చూపించి రహస్యంగా వసూలు చేసిన సొమ్ముపై కన్నేసిన ఖుసృ ద్దీన్ పలువురితో కమ్మక్కై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసిన డబ్బుతో పరారీకి ప్రయత్నించాడు.




