Friday, April 17, 2026
Google search engine
HomeUncategorizedదేవుడే నన్ను పంపాడు

దేవుడే నన్ను పంపాడు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఇటీవలే కాం గ్రెస్ పార్టీని వీడిన జీవన్‌రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిం దే. ఆ ప్రకటన తర్వాత తొలిసారిగా శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో ఆయన కెసిఆర్‌తో సమావేశమయ్యారు. జీవన్‌రెడ్డిని కెసిఆర్ సాదరంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకుని, శాలువాతో సన్మానించారు. అంతకు ముందు ఎర్రవెల్లికి చే రుకున్న జీవన్ రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈ శ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.ఈ సం దర్భంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారు లు, జగిత్యాల జెడ్‌పి మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.

కెసిఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు..” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కెసిఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపు కెసిఆర్, జీవన్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్న తర్వాత కెసిఆర్‌ను ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో భవిష్యత్ కార్యచరణతో పాటు పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

సిఎం చెప్పినట్లు టిపిసిసి నడుస్తుంది : జీవన్‌రెడ్డి

సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు టిపిసిసి నడుస్తుందని జీవన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి వల్ల అధిష్ఠానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందని పేర్కొన్నారు. కెసిఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఆ సభకి కెసిఆర్‌ను ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను అధికార బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదని అన్నారు. పదవుల కోసమే బిఆర్‌ఎస్‌లోకి వెళ్లాలంటే తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళేవాడిని అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అని, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు మాత్రమే అని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని, రెండో సంవత్సరం లక్ష ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లు అయినా ప్రజాహితం కోసం పని చేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని అన్నారు.-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments