Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఆదాయ వనరులు పెరగాలి

ఆదాయ వనరులు పెరగాలి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని శాఖలు 2047 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్షంగా ఆదాయం పెంచుకోవాలని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సచివాలయంలో రెవిన్యూ జనరేషన్, రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. స మావేశంలో సభ్యులు, మంత్రులు ఉత్త మ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ల తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ ఏఐ వంటి ఆధునిక టె క్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో ప న్నుల ద్వారా వస్తున్న ఆదాయంపై ని రంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణ తో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖ ల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని తెలిపారు.

అధికారులు మరిం త పకడ్బందీగా పనిచేసి ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. నిరంతరం సమీక్షలు, పన్ను ల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా కమర్షియల్ టాక్స్ శాఖలో జిఎస్టీ ఆదాయం గత మూడు నెలలుగా 15 శాతం పెరుగుదల కనిపించిందని డిప్యూటి సిఎం వివరించారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందన్నారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవిన్యూ జనరేషన్, రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని డిప్యూటి సిఎం తెలిపారు. 2047 వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని,

ఈ మేరకు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆయన స్పష్టం చేశారు. భూముల విలువ పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేశారని, ఆ కమిటీల నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత క్యాబినెట్ కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను డిప్యూటి సిఎం ఆదేశించారు. అధికారులు ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు యాక్షన్ రిపోర్టుతో తదుపరి సమావేశానికి రావాలన్నారు. హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమాచారం అందడం మూలంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవిన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపునకు సంబంధించి చేపట్టిన చర్యలు ఫలితాలపై మంత్రులు సమీక్ష చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments