Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedట్రంప్ శాంతి మంత్రం..ఇరాన్ తిరస్కారం

ట్రంప్ శాంతి మంత్రం..ఇరాన్ తిరస్కారం

టెహరాన్: తమ షరతులకు అమెరికా ,ఇజ్రాయె ల్ తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందని ఇరాన్ బుధవారం స్పష్టం చేసింది. చర్చలకు వచ్చిన ట్రంప్ , తమకు షరతులు విధించడం కుదరదు. ట్రంప్ అ దుపాజ్ఞలు, ఆదేశాలు చెల్లనేరవని పేర్కొంటూ ఇ రాన్ అమెరికా శాంతి ప్రతిపాదనలను తిరస్కరించింది. దీనితో ప్రస్తుత గల్ఫ్ యుద్ధ సంక్షోభం కొనసాగే పరిస్థితి తలెత్తింది. ట్రంప్ గడువులు, కాలపరిమితి సందేశాలను తాము అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. పశ్చిమాసియా యుద్ధం దశలో అ మెరికా ప్రతిపాదనలు అతిగా ఉన్నాయని ఇరాన్ అధికారికంగా తేల్చిచెప్పినట్లు ఇరాన్ ప్రెస్ టీవీ తెలిపింది. యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షులు చేసిన 15 అంశాల ఫార్మూలాను, హర్మూజ్‌పై ఉమ్మడి నియంత్రణ అంశాన్ని ఇరాన్ పూర్తి స్థాయిలో సమీక్షించుకుంది. ఈ ప్రతిపాదనలు తమ దేశానికి ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్ తేల్చిచెప్పింది. ట్రంప్ ప్రతిపాదనలను తిప్పికొట్టిం ది. అమెరికా నుంచి వెలువడ్డ ప్రతిపాదనలకు త మ తొలిస్పందన సానుకూలంగా ఉందనే వాదన సరికాదని , ఇప్పటికీ వీటిని పరిశీలించడం జరుగుతోందని ఇరాన్ ఉన్నత స్థాయి వ్యక్తి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఏది ఏమైనా యుద్థాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇరాన్ నిర్ణయాధికారంపైనే ఆధారపడి ఉంటుంది.

ఇతరుల ఆదేశాలకు అనుగుణంగా యుద్ధం విరమించుకుని , మోసపోయే స్థితిలో ఇరాన్ లేదని తెలిపారు. తాము పెట్టే షరతులకు అమెరికా సరేనంటేనే తమ దేశం చర్యలు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ఒకటి రెండు కాదు. మొత్తం తమ షరతులు అంగీకరించాల్సిందే అని ట్రంప్ దౌత్యానికి సవాలు విసిరారు. ఇతరుల ఆధిపత్యం లేకుండా హర్మూజ్‌పై ఇరాన్ సార్వభైమాధికారానికి కట్టుబడి ఉండాలనేది తమ ప్రధాన డిమాండ్ అని ఇరాన్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై తమకు సహజసిద్ధమైన చట్టపర హక్కు ఉందన్నారు. ఇక ఇప్పటి యుద్ధంపై బాధ్యత ఎవరిది అనేది నిర్థారణ కావల్సి ఉంది. ఇది తేలితే జరిగిన నష్టానికి పరిహారానికి గ్యారంటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎప్పుడూ ఇరాన్‌పై శత్రుపక్షం దాడికి దిగరాదని, ఈ హమీ ఇవ్వాలని తెలిపారు. తమ అన్ని షరతులు ఆమోదించేంత వరకూ ఇప్పుడు సాగుతున్న తమ దేశ చర్యలన్నింటిని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గల్ఫ్‌పై దాడులు ఆగబోవని పరోక్షంగా వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments