Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఅసెంబ్లీలో సారా లొల్లి

అసెంబ్లీలో సారా లొల్లి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పసారాపై అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పపువ్వు సారాకి ఒక నేత పేరు పెట్టవద్దని ఎమ్మెల్యే రాకే ష్ రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ ప్పపువ్వు సారా గురించి చర్చ సందర్భంగా బిజె పి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభ లో ఒక్కసారిగా దుమారం రేగింది. మంత్రులు వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిల మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో బుధవారం జడ్చ ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ‘ఇప్ప పుప్పు సారా’పై మాట్ల్లాడగా అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాల పేలాయి. ఈ క్రమంలోనే బిజె పి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్ప పు వ్వు సారా అంశం ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని, ఆ ఉత్పత్తి ద్వారా 130 దేశాల్లో ఆదా యం వస్తుందంటూ అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగంపై ఆయన సెటైర్లు వేశారు. ఇప్పపువ్వు సా రాకు ‘ఇప్పటకీలా అనండి’ ఇంకేమైనా పేరు పె ట్టండి కానీ, ఒక నేత పేరు పెట్టకండి అనటంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అ యితే, రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి అంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు.

సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఆ నేత పేరు తీసినందుకు రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అ నంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆ నేతపై అంత కక్ష ఎందుకు?, మహిళా నేతను కించ పరిచిన ఎమ్మెల్యే రాకేశ్ రె డ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాం డ్ చేశారు. సంక్షేమ పథకాలకు మాత్రమే ఆ నేత పేరు పెడతామన్నారు. సంక్షోభం తెచ్చేవాటికి కాదన్నారు. ఇప్ప పువ్వు సారా అంశంలో ఆ నే త పేరు ఎత్తడం మహిళా లోకాన్ని అవమానించడమేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బిజెపి క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ నేత పేరుని అవమనిస్తారా అని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు బిజెపి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి నోరు జారారని, క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

సభ గౌరవాన్ని కాపాడాలి: ప్యానల్ స్పీకర్

బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ ఆ నేత పేరుపై గంటకు పైగా సభా సమయం వృథా చేయడం సరికాదన్నారు. సభ్యుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తే సరిపోతుందని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. స్వర్గస్తులైన ఆ నేతపై సభలో కామెంట్స్ చేసిన రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్యానల్ స్పీకర్ బాలు నాయక్ సూచించారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. సభలో రాకేష్‌రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు బాలునాయక్ ప్రకటించారు.

ఎవరూ అపార్థం చేసుకోవద్దు: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

ఇప్ప పువ్వు సారా చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పపువ్వు సారాను అందుబాటులోకి తెస్తే, దానికి ఆ నేత పేరు పెట్టవద్దని చెప్పడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తాను మాట్లాడిన మాటలు తప్పనిపిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పేర్కొన్నారు. తన మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఆ నేతను అవమానించలేదని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ నేత ఉక్కు మహిళ, ప్రపంచస్థాయి నేత అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆ నేత పేరు పెడుతుంటారు. ఇప్పపువ్వు సారా పథకానికి గొప్ప మహిళానేత పేరు పెట్టొద్దని గౌరవంతో సూచించానని, అవమానించాలని కాదని ఆయన అన్నారు.

నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, తమాషా చేస్తున్నారా అంటూ నన్ను బెదిరిస్తారా?, నేనేం తప్పు మాట్లాడానో రికార్డులు పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే హౌస్ కమిటీ వేయండి, క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతా, మాజీ ప్రధాని అంటే తమకు ఎప్పుడూ గౌరవమేనని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలుగజేసుకొని రాకేశ్ రెడ్డి ఎక్కడా అసభ్య పదజాలం వాడలేదని స్పష్టం చేశారు. మంత్రులు అనవసరంగా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాకేశ్ రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments