
న్యూఢిల్లీ: ప్రీమియం లేదా హైయ్యర్ గ్రేడ్ పెట్రోలియం ధర లీటరుకు రూ.2 పెంచా రు. ఇక ఇండస్ట్రీయల్ డీజిల్ రేటును లీటరుకు రూ.22 మేర పెంచారు. సాధారణ పెట్రోలు, డీజిల్ ధరలు యధాతథంగా ఉం టాయి. ఈ వివరాలను కేంద్ర పెట్రోలి యం, సహజవాయువు మంత్రిత్వశాఖ సం యుక్త కార్యదర్శి సుజాత శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధర పెరగడంతో దీని ప్రభావం ఇక్కడి మా ర్కెట్ పడింది. పెరిగిన ధరల మేరకు ఢిల్లీలో ప్రీమియం 95అక్టెన్ పెట్రోలు ధర ఇంత కు ముందు రూ.99.89 ఉండగా ఇది ఇ ప్పుడు రూ.101.89కు చేరుతుంది. పరిశ్రమలలో వాడకానికి ఉపయోగించే పెట్రో లు, లేదా బల్క్ పెట్రోలు ధర ఇంతకు ముం దు లీటరుకు రూ.87.67 ఉండగా ఇప్పుడిది రూ.109.59 కి చేరుతుంది.




