
మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్య లు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) నియామక ప్రక్రియల కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లా లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటిలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటిం చారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే ఈ కమిటీల నియామకంపై పార్టీలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. నియామకాల్లో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు బుధవా రం రాత్రి వరకు సుదీర్ఘ కసరత్తు చేసి, అన్ని జి ల్లాలకు సంబంధించి స్థానిక ఎంఎల్‌ఎలు, ని యోజకవర్గ ఇంచార్జీలతో చర్చించి, వారిని స మన్వయ పరుస్తూ ఈ జాబితాను రూపొందించారు. గతంలో వేసిన స్క్రీనింగ్ కమిటీ సూచనలను పాటిస్తూ ,
పార్టీ కోసం కష్ట డిన వారికి ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు. ఈ ప్రకటనలో కేవలం అధ్యక్షులను మాత్రమే కాకుండా, జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే పూర్తిస్థాయి యంత్రాంగాన్ని నియమించారు. ప్రతి జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు ఎగ్జి ్యటివ్ మెంబర్లను నియమించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కమిటీలను ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తోంది. తొలి విడతలో 14 జిల్లాలను ప్రకటించగా, మిగిలిన జిల్లాల కమిటీలను కూడా త్వరలోనే వెల్లడిం నున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నిర్మా ణంపై ఎక్కువగా దృష్టి సారిం లని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీలు పనిచేయాలని హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ నియామకాల్లో వేగం పుంజుకున్నట్లు సమాచారం.




