Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedరేవంత్‌రెడ్డి బినామీ దందా

రేవంత్‌రెడ్డి బినామీ దందా

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. సిఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై కేసులను ప్ర భుత్వం తారుమారు చేసిందని ఆ రోపించారు. కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ అనే సంస్థ కు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంపై సిబి ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టెరేట్ (ఇడి), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) వంటి కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.2,500 కోట్ల విలువైన సాగునీటి తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ పనులను అప్పగించారని లేఖలో ఆరోపించారు. ముఖ్యమం త్రి తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలను తారుమా రు చేయిస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి బినామీ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.’

కెఎల్‌ఎస్‌ఆర్ సంస్థపై కేసులు నమోదు కాగా, విచారణ వేళ ముఖ్యమం త్రి ఆదేశాలతో ప్రభుత్వం సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని ఆరోపించారు. సాక్ష్యాలు పోయా యని చెప్పడం దారుణమన్నారు. అధికారులపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను మాయం చేయించారని మండిపడ్డారు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయన్నారు. రాష్ట్రంలో విచారణ సంస్థలు, పోలీసు లను నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కెఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ దివాలా తీసినా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయించడం సరికాదన్నారు. ఈ సంస్థపై విచారణ జరగాలని, అది నిష్పక్ష పాతంగా జర గాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ఏజెన్సీలు విచారణ చేయాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్రం పట్టించుకోలేదన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments