
మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ప్రసు ్తానికి టికెట్ ధరల పెంపుపై ఇప్పటివర కు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మైత్రి మూవీ మేకర్స్ సవాల్ చేశారు. వీరి పిటిషన్‌ను శుక్రవారం విచారించిన జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ చందూర్కర్ ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇ చ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ధరల పెంపుపై గత విధానాన్నే కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలో విడుదల కాబోయే చిత్రాలకు ఊరట లభించింది. ప్రీమియర్స్‌తో పాటు టికెట్ ధరల ను పెంచుకునేందుకు వెసులు బాటు లభిచింది. కాగా, సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి.




