Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedగ్యాస్ కొరత లేదు

గ్యాస్ కొరత లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఇరిగేషన్, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశా రు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధిం చి సచివాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల శా ఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్ర శాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్‌లు, ఎస్‌పిలు, పోలీస్ కమిషనర్‌లు, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్యాస్ కొరతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.

బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు

గ్యాస్ సరఫరాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రతి గృహ వినియోగదారుడికి అవసరమైన మేర సిలిండర్లు సరఫరా చేస్తామని మంత్రి భరోసానిచ్చారు. గృహ అవసరాల గ్యాస్‌ను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా విక్రయాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆసుపత్రులు, ప్రభుత్వ వసతి గృహాలకు ఎలాంటి అంతరాయం లేకుండా సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.

రోజువారీ 72 శాతం గ్యాస్ బుకింగ్స్

ఇక నిత్యావసర వస్తువుల సరఫరాలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ తరలకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. జిల్లాలో సమన్వయ కమిటీలతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు,ఆశ్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ప్రస్తుతం రోజు వారీగా 72 శాతం బుకింగ్స్ జరుగుతున్నాయని, అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు, విద్యాసంస్థలకు, వృద్దాశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు

రాష్ట్రంలో 810 ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్ల్లీంచడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు

పాల్పడనందుకు ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్‌పిజి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments