Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedతెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

సారా ఆరోగ్యానికి హానికరం కాదు

తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు

బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉంది

త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తా

సచివాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిట్‌చాట్

మనతెలంగాణ/హైదరాబాద్: గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాల పాటు బ్రతికారని, ఇప్పుడు మద్యం తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అందువల్ల తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తానని ఆయన తెలిపారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడానికి సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైంటిఫిక్‌గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉందన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు. ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments