Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedకొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ సుమధుర అపార్ట్‌మెంట్‌లో మనుశ్రీ (32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. కర్ణాటకకు చెందిన ఆమె ఐటి ఉద్యోగం చేస్తూ నగరంలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి నుంచి మనుశ్రీ తన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె పక్క గదిలో ఉండే ఆమె ఫ్రెండ్‌కు ఫోన్ చేశారు.

సోమవారం ఉదయం ఆమె వెళ్లి చూడగా గది తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి చూడగా మనుశ్రీ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. పని ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments