Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedకాంగ్రెస్ ఫేక్ పబ్లిసిటీ

కాంగ్రెస్ ఫేక్ పబ్లిసిటీ

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీ మోత అ న్నట్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ తీరు ఉం దని మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింద ని కల్లబొల్లి మాటలు చెబుతున్న సిఎం రేవంత్‌రెడ్డి కేరళ ఎన్నికల కోసం అక్క డి మలయాళ పత్రికల్లో సిఎం, డిప్యూ టీ సిఎంల ఫొటోలతో వందల కోట్లు ఖర్చు చేసి పుల్ పేజీ యాడ్స్ ఇవ్వడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటిఎంలా మారిందని అర్థమవుతోందన్నారు. శుక్రవారం హరీష్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు 420 హామీలు అం టూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఇక్కడ ప్రజ లు గొంతు కోసి, కేరళలో కలర్‌పేజీ యాడ్స్ ఇస్తూ డబ్బా ప్ర చారం చేస్తోందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి నా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం కోసం తెలంగాణ ప్ర జల సొమ్మునే వాడుకుంటుందన్నారు. సంక్షేమ పండుగ అ ని అబద్దపు యాడ్స్ ఇచ్చుకోవడానికి చేతులు ఎలా వచ్చాయని,

అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని హరీశ్‌రావు కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. 800 రోజుల పాలనలో చేసింది ఏం లేక, 99 రోజు ప్రణాళిక పేరిట రేవంత్‌రెడ్డి మరో డ్రా మాకు తెరతీశారని ఆయన ఆరోపించా రు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా? అం టూ హరీష్‌రావు నిలదీశారు. అమలు కు నోచుకోని ఆరుగ్యారంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చే సిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది అని ఆయన విమర్శించారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుం చి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పు డు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గు చేటన్నారు.

రెండున్నరేళ్లలో అసలు ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ పైఫల్యాలు ప్రచారం చెప్పుకుంటారా? అని ఆయన అన్నారు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు లేదన్నారు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేశారన్నారు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారని, నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఊదర గొట్టి, అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారని, రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయని హరీష్‌రావు విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments