
న్యూడిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడు ఘటనపై టీం ఇండియా ప్రధాన కోచ్, గౌతమ గంభీర్ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియావేదికగా ఆయన పోస్ట్ చేశారు.
‘‘ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ గంభీర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్ టీం ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే ముందు 2019 నుంచి 2024 వరకు ఈస్ట్ ఢిల్లీ ఎంపిగా ఉన్నారు.




