
నెల్లూరు: నగరంలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. నెల్లూరులోని ఎన్టిఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీ.. మినీ వ్యాను, 3 బైక్‌లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




