Friday, June 12, 2026
Google search engine
HomeUncategorizedఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి బిఆర్‌ఎస్ కైవసం

ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి బిఆర్‌ఎస్ కైవసం

మన తెలంగాణ/హైదరాబాద్: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలి టీ చైర్మన్ పీఠాలను బిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను బిఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా ర్మన్‌గా సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బిజెపి కౌ న్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. అ లాగే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బిఆర్‌ఎస్ అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్  పదవిని సిపిఐ అభ్యర్థి సరిత దక్కించుకున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు.

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వాయిదా పడింది. ఈ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య వాయిదా పడింది. ముందుగా ఛైర్‌పర్సన్ ఎన్నిక వేళ అధికారులు బిజెపి అభ్యర్థి మౌనిక పేరు ప్రతిపాదించారు. మౌనికకు మద్దతుగా ఎనిమిది మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. ఎన్నిక తీరుపై ఎంఎల్‌ఎ వెడ్మ బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముందుగా బిజెపి అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళన చేశారు. అధికారులతో వెడ్మ బొజ్జు వాగ్వాదానికి దిగారు. దీంతో ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సమావేశం నుంచి ఎంఎల్‌ఎ వెడ్మ బొజ్జు బయటకు వెళ్లిపోయారు. మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేశారు. వెడ్మ బొజ్జుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అభ్యర్థికి మెజారిటీ ఉన్నా ఛైర్మన్‌గా ప్రకటించలేదని బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments