Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedసబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం ఉదయం సబ్‌రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు సబ్ రిజిస్ట్రేష న్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్, చలాన్ల చె ల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు ఆ గిపోయాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర వినియోగదారులు ఇబ్బందు లు పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుల దగ్గర క్ర య, విక్రయదారులు పడిగాపులు కాశారు. ఆధార్, ఈ కేవైసీ, థంబ్ ఇంప్రెషన్ వెరిఫికేషన్‌కు సంబంధించిన సర్వర్ డౌన్ కావడం తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఉదయం రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటి నుంచే ఈ సమస్య తలెత్తింది.

స్లాట్ బుక్ చేసుకున్న భూములు, ఇళ్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు గంటల త రబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది మధ్యా హ్నం వరకు వేచి చూసి ఇళ్లకు వెళ్లిపోయా రు. సర్వర్ డౌన్ కారణంగా క్రయ, విక్రయదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రిజిస్ట్రేష న్ కోసమని ఉద్యోగాలు, ఇతర పనులు మా ని ఆఫీసులకు వచ్చిన వారు ఇబ్బందులు ప డ్డారు. చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కనీస వ సతులు లేకపోవడంతో దూరప్రాంతాల నుం చి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. రిజిస్ట్రేషన్ల శాఖ కు చెందిన ప్రధాన స ర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ స మస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. అధికారులు సాంకేతిక బృందాలను రంగంలోకి దించి సర్వర్ వ్యవస్థను పునరుద్ధరించారు.

గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక డిస్టిక్ రిజిస్ట్రార్ అవినీతిపై

గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక డిస్టిక్ రిజిస్ట్రార్ అవినీతిపై సిఎంఓకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఆయన మహిళా ఉద్యోగినులను వేధిస్తున్నారని, రియల్‌ఎస్టేట్ వ్యాపారం చే స్తున్నారని ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు లు అందినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆయ న సాయంత్రం వరకు తన ఆఫీసులో ఉండకుండా బయట రియల్‌దందా చేస్తూ సా యంత్రం ఆఫీసుకు వస్తున్నారని తనకు వేరే జిల్లాలో ఇన్‌చార్జీ పదవి కూడా ఉండడంతో తనిఖీలు వెళ్లినట్టుగా ఉన్నతాధికారులకు త ప్పుడు సమాచారం ఇచ్చి రియల్‌వ్యాపారం చేస్తున్నారని సిఎంఓకు కొందరు ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments