Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedకరీంనగర్ టూటౌన్ ఎస్‌ఐ ఆత్మహత్య

కరీంనగర్ టూటౌన్ ఎస్‌ఐ ఆత్మహత్య

మన తెలంగాణ /కరీంనగర్ : కరీంనగర్ టూటౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అత్తవారింట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఆతని భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నగరంలోని టూటౌన్ పీఎస్‌లో చంద్రశేఖర్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. కరీంనగర్ వన్‌టౌన్ పీఎస్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో చంద్రశేఖర్, దివ్య తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 18న దివ్యకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దీంతో నొప్పిని భరించలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు

ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ నయం కాకపోవడంతో అనంతరం ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య మరణంతో ఎస్‌ఐ చంద్రశేఖర్ శోకసంద్రంలో మునిగిపోయారు. అతని భార్య మృతి చెందిన అనంతరం ఆయన అంత్యక్రియలకు ఆమె స్వగ్రామం సీతంపేటలోని అత్తవారింటికి వెళ్లారు. భార్య మృతితో మనస్తాపానికి గురై ఆ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై : చంద్రశేఖర్, దివ్య దంపతులకు పది, ఆరు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ప్రాంతం లో విషాదఛాయలు అలముకున్నాయి.

అమ్మా, నాన్న మేము మీకు గుర్తుకు రాలేదా: కొడుకులు అశ్వద్ధామ, అభిమన్యు

మమ్మల్ని ఒంటరిని చేసి వదిలిపోయారా నాన్న, అమ్మ అం టూ పిల్లలు ఏడుస్తుంటే గ్రామస్తులంతా తల్లడిల్లి పోయా రు. క్షణికావేశంలో తల్లి, తండ్రి ఇద్దరు ఐదు రోజుల వ్యవధిలో మరణించడంతో వీరిద్దరికి కలిగిన మగ పిల్లలు అశ్వద్ధామ (7 ), అభిమన్యు(5) అనాధలయ్యారు. అభం శుభం ఎరుగని ఈ పసిపిల్లలను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డప్పుడు పిల్ల లు గుర్తుకు రాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments