
మన తెలంగాణ/నంగునూర్ : ఆయిల్ పామ్ పంట సాగులో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలపాలని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నంగునూ ర్ మండలం నర్మెట్టలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికారుల తో కలిసి ఏర్పాట్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే కేంద్ర బిందువులాగా ఉందని రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పండించిన పంటను నర్మెట పామ్ ఆ యిల్ ఫ్యాక్టరీకి తీసుకురావడానికి రైతులకు సులువుగా ఉం టుందని అన్నారు. తెలంగాణలోనే మొదటి ఆయిల్ పామ్ సి ఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని, రా ష్ట్రంలో సిద్దిపేట జిల్లా నుంచి ఆయిల్ సప్లై చేసే అదృష్టం నర్మెట్టకు దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి 30 జిల్లాల నుంచి రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావడంతో పాటు 30 జిల్లాలో ప్రైవేట్ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని రైతులపై తనకున్న మమకారంతోనే వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి చేశానని గుర్తు చేశారు.
యుద్ధ్దప్రాతిపదికన ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి
16 నెలల అతి తక్కువ సమయంలో దేశంలో పూర్తి చేసి న మొదటి ఫ్యాక్టరీ అని ఆయన పే ర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ 300 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్లు తెలిపారు. 30 టన్ను ల నుండి 120 టన్నుల వరకు దీని సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ మి నహా అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అవకాశం ఉందని, గతంలో రాష్ట్రం లో ఎక్క డ సాగు చేసిన దానిని అశ్వారావుపేటకి తీసుకెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దిపేట జిల్లాలో తక్కువ సమయంలో ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేయడమే కాకుండా 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయ డం జరుగుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీలో విడుదలైన వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఇ క్కడే స్వతంత్రముగా ఆయిల్ రిఫైనరీ ప్రారంభానికి సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామి తెలిపారు. అంతే కాకుండా నేరుగా విజయ బ్రాండ్ ద్వారా లబ్ధిదారులకు ఆయిల్ వస్తుందన్నారు. తెలంగాణలో ఎక్కడ ఆయిల్ ఫామ్ సా గు చేసిన ఆయిల్ ఉత్పత్తి ఇక్కడి నుండే జరుగుతుందన్నారు.
ఏ వాతావరణంలో అయినా ఆయిల్ పామ్ సాగు
ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చన్నారు. మల్లన్నసాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగిందని, కాళేశ్వరంతో పాటు ఆ ప్రాజెక్టు కింద ఉన్న డ్యాంలను బట్టి ఈ ఫ్యాక్టరీ ని ర్మించలేదన్నారు. మలేషియా కంటే కూడా మన దగ్గర అధిక ఆయిల్ ఇక్కడి నుండే వస్తుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రజలది, ప్ర జల సంపదతో నిర్మించింది కాబట్టి ఎప్పటికైనా ఈ ప్యాక్టరీ ప్రజలకే సొంతం అన్నారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చే సీ ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వాలది అని ఎల్లంపల్లి కాళేశ్వరానికి జీవనా డి ఎల్లంపల్లి అయితే ఎక్కడి నుండి నీళ్లు తరలించాలన్న ఎల్లంపల్లి కీలకం అవుతుందని, ఎల్లంపల్లి నుండి నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంతెస్తే స్విచ్ బిఆర్‌ఎస్ ప్రభు త్వం వాళ్ళు నొక్కారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రా ష్ట్రానికి రావలసినది వాటాగా ఇస్తున్నారని అందులో కేం ద్రం ఇచ్చేది ఇచ్చేది ఏమి లేదన్నారు. తాను వచ్చిన తరువాత 5 ఫ్యాక్టరీలు సంతకం చేసిన ముందుగా పూర్తి చేసింది నర్మెట్ట అని అన్నారు. ఇది అన్ని జిల్లాలకు అనుగుణంగా మద్యలో ఉండడమే కాకుండా. హైదరాబాద్‌కి కూడా దగ్గరలో ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ రెమ్యునరేషన్ నుండి క ట్టిందని ఇది కేవలం ప్రజల డబ్బు. ప్రజల సొత్తేనన్నారు. గ తంలో టన్నులు ఉంటే తాను వచ్చాక 21 వేలు ట న్ను అయిందని మున్ముందు 25 వేలు అయ్యేలాగా కృషి చేస్తానన్నారు.
రైతులంతా ఆయిల్ పామ్ సాగుపై
దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
రైతులంతా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని రవా ణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ లో ఆయిల్ ఫామ్ అభివృద్ధి చేయడానికి తాను స్వయంగా ఆయిల్ పామ్ రైతుగా ఫ్యాక్టరీ నిర్మాణానికి పూర్తిక కార్యదీక్ష చేపట్టామన్నారు. గుజరాత్‌లో పాలకు కురియన్ మాదిరి ఆయిల్ పామ్‌కి తుమ్మల నాగేశ్వరరావు బ్రాండ్ అం బాసిడర్ అని కొనియాడారు. ఉత్తర తెలంగాణకు ఈ ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్ సాగు చేసిన వారికి సిద్దిపేట ప్రధాన కేంద్రంగా ఉండబోతుందన్నారు. ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారన్నారు. రైతులంతా ఆయిల్ పా మ్ సాగుపై దృష్టి సారించి ఎలాంటి నష్టాలు లేకుండా లాభా లు గడించాలన్నారు. గంటకు 30 టన్నుల నుండి 180 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఈ ఫ్యాక్టరీ కి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి,సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.




