
మన తెలంగాణ/హైదరాబాద్: తాము సంకల్పించిన తెలంగాణ రైజింగ్ లక్షానికి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద పీ ట వేయడం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమానికి స మాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలు ఉండకపోవచ్చన్నారు. అయితే జాతీయ విద్యా విధానానికి అ నుగుణంగా కమిషన్ సమర్పించిన నివేదిక ఫైనల్ కా దని, దీనిపై నియమించిన అధ్యయన కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో బడ్జె ట్ ప్రతిపాదించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ ‘ఇది ప్యూచరిస్టిక్ బడ్జెట్’ అని వ్యాఖ్యానించారు. రాష్రాభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధి ని దృష్టి లో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడే విధంగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కు టుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టామని, ఈ పధకం ద్వారా రూ. 5 లక్షల బీమా పరిహారం అందుతుందని ఆయన చెప్పారు.దీంతో రాష్ట్రంలోని దాదాపు 1కోటి 15లక్షల కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించామని,
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రీ ప్రై మరీ నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభు త్వ స్కూల్లో చదివే విధానాన్ని అమ లు చేయనున్నట్లు ఆయ న తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు లు తీసుకుని రాబోతున్నామని, ఇకపై ఎస్‌ఎస్‌సి బోర్డు లేనట్లేనని, పదో తరగతి పరీక్షలు ఉండబోవని ఆయన పరోక్షంగా అన్నారు. విద్యా వ్యవస్థలో మా ర్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఫైనల్ కాద ని, దీనిపై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు అని చెబుతూ ఇందులో గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే రూ. 3.30 లక్షల కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. తాము వివిధ పథకాలకు ఖర్చు చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయలేనని ఆయన చెప్పారు. జాతీయ జిడిపి కంటే రాష్ట్ర జిడిపి పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. జిఎస్‌టి వసూళ్ళు రెండు నెలల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు దాటిందన్నారు.




