Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedప్రజాపాలన కాదు.. అరాచక పాలన

ప్రజాపాలన కాదు.. అరాచక పాలన

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ అ న్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కు మ్మెర ఘటనలో రెండు నెలల చిన్నారిని కోల్పోయిన కుటుంబం చేస్తున్న దీక్షా శిబిరాన్ని బుధవారం కేటీఆర్ సందర్శించి బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన విషయాలను బాధితులు చంద్రకళ, గణేష్, మౌనిక లను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని న్యాయం జరిగే వరకు పోరాడుతామని కేటీఆర్ భరోసా అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర మల్లన్న జాతరలో దర్శనం కోరిన చంద్రకళ కుటుంబాన్ని అవమానించడమే కాకుండా ఈ విషయాన్ని ప్రశ్నించిన గణేష్ పై విచక్షణారహితంగా దాడి చేశారని, చిన్నారి ముఖం చూసి అయినా తన భర్త గణేష్‌ను వదిలిపెట్టాలని మౌనిక కాళ్ళ వేళ్లాపడిన కనికరించని శ్రీనివాస్ రెడ్డి, తుకారాంరెడ్డి తదితరులు చిన్నారిని అదే కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడి మరణించిందని కేటీఆర్ అన్నారు.

ఈ ఘటన తనను కలిచి వేసిందని బాధితుల మాటలు వింటుంటే కళ్ళు చెమర్చాయి అన్నారు. అహంకారంతో కొట్టిన కుమ్మెర సర్పంచ్ ఇతర ఏడుగురిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని వారిని శిక్షించకపోతే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ లో జరుగుతున్న అరాచక పాలనపై నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్నది పేరుకే ప్రజా పాలన అని… సాగుతున్నది మాత్రం అరాచక పాలన అని కేటీఆర్ దిగబట్టారు. కుమ్మెర ఘటన మాటలుకు అందని మహావిషాదమని నిందితులకు అండగా నిలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇతర రాజకీయ నాయకులపై కూడా కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పుట్టపాక మహేంద్ర నాథ్ పుట్టిన గడ్డలు ఇంతటి దుర్మార్గం చోటుచేసుకుని సామాజిక న్యాయం పుట్టిన గడ్డపైనే ఇలాంటి కుల వివక్షతో కూడిన దుర్మార్గపు దాడి హత్య జరగడం అమానుషమన్నారు. పసికందులు చంపిన మానవ మృగాలకు శిక్ష పడాలని అందుకు అవసరమైన అన్ని సెక్షన్ లలో నిష్పక్షపాతంగా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అందరిని వెంటనే అరెస్టు చేసి తమ నిజాయితీని చాటుకోవాలని పోలీసులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అందించడం జరిగిందని భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఇంటిని నిర్మించి పాలు పొంగించే కార్యక్రమానికి తానే స్వయంగా వస్తానని కేటీఆర్ సభ ముఖంగా హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఎంజాయ్ యాదవ్, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, బీఆర్‌ఎస్ నాయకులు రాజారామ్ యాదవ్, చిలకమర్రి నరసింహ, బత్తుల రాజు, నిన్నపనేని నరేందర్, బైకాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments