Saturday, September 12, 2026
Google search engine
HomeUncategorizedమిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యులు

మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యులు

మన తెలంగాణ/ మిర్యాలగూడ: నకిలీ కంటి వై ద్యులను పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని డాక్టర్స్ కాలనీ లో ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్ల బృందం తనిఖీలు చేపట్టి నకిలీ కంటి వైద్యుల వ్య వహారం గుర్తించినట్లు తెలిపారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జూ రి వికాస్ కుమార్ డిగ్రీ డిస్‌కంటిన్యూ చేశాడు. 2007 నుంచి 2009 వరకు సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో డిఏవో కోర్స్ చేసి అనంతరం హైద్రాబాద్‌లో ట్రాన్స్ ఐ, శ్రీ నేత్రాలయలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌గా ఐదేళ్లు, అదేవిధంగా మిర్యాలగూడ హనుమాన్ ఐ క్లినిక్‌లో ఆరేళ్లు పని చేశాడు. ఈ క్ర మంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌గా పనిచేసేది వదిలేసి 2021లో మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మీ కంటి ఆసుపత్రిని స్థాపించి నాటి నుంచి ఆప్తాల్మిక్ డాక్టర్‌గా పేషెంట్లను పరిచయం చేసుకుంటూ చికిత్స చేస్తున్నాడు. ఆయన ప్రారంభించిన శ్రీ మహాలక్ష్మీ కంటి ఆసుపత్రిలో స్పెషలిస్ట్ ఆప్తాల్మిక్ కన్సల్టెంట్‌ను నియమించి అతని పేరి ప్రిస్క్రిప్షన్లను ప్రింట్ చేయించారు. ఆ స్పెషలిస్ట్ కంటి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా నమ్మించారు. ఈ నేపద్యంలో గత ఏడాది జూన్ 8న కంటి సమస్యపై బైరెడ్డి పద్మ అనే మహిళ ఆసుపత్రికి వచ్చింది.

కుడి కన్నును పరీక్షించి కంటిలో చుక్క ఉందని సర్జరీ చేయాలని నిర్ణయించిన వికాస్ కుమార్ డాక్టర్ పిలిపించి టెస్టులు కంప్లీట్ అయ్యాయని సర్జరీ ఖచ్చితంగా చేయాలని సూచిస్తూ అదే రోజు మధ్యాహ్నం సర్జరీ చేయించాడు. సర్జరీ అనంతరం మరుసటి రోజు తన కుడి కన్ను పూర్తిగా కనిపించడం లేదని చెప్పగా వికాస్ కుమార్ డాక్టర్‌కు చెప్పకుండా అతని ప్రిస్క్రిప్షన్‌పై కొన్ని మందులు రాసి ఇచ్చాడు. ఫలితంగా ఆ మహిళ కంటి చూపు పూర్తిగా మందగించింది. ఈ తరహాలో అర్హత లేకుండా నకిలీ వైద్యాన్ని అందించిన తీరుపై అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల శ్రీ మహాలక్ష్మీ, శాలిని, యశస్వి, అన్నపూర్ణ, రూఫా కంటి ఆసుపత్రులను తనిఖీ చేసి వారు ఆప్తాల్మిక్ డాక్టర్లు కాదని వారికి ఆధునీక వైద్యం, నేత్ర వైద్యం చేసే అర్హత లేదని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆప్తాల్మిక్ డాక్టర్లుగా చెప్పుకుంటూ చలామాణి అవుతున్న వల్కి శ్రీను, పెమ్మి వెంకటేష్, బాణావత్ శివ కోటేశ్వర్‌రావు, పజ్జూరి వికాస్ కుమార్, గడ్డం నాగరాజులపై చేసిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టి ఆరుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు చెప్పారు. సమవేశంలో సీఐలు నాగభూషణరావు, సోమనర్సయ్య సిబ్బంది ఉన్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments