Monday, June 15, 2026
Google search engine
HomeUncategorizedలేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు

లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు

ఎపిలో రిపీటెడ్‌గా నేరాలు చేస్తున్న రౌడీషీటర్లపై ఎస్పీ అజిత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కోవూరు, నవాబ్ పేట, వేదాయ పాలెం పోలీస్‌స్టేషన్‌లలో ఇప్పటికే అరుణపై పలు కేసులు నమోదయ్యాయి. లేడీ డాన్ అరుణ బయటికీ వస్తే నేరాల్లో పాల్గొనే అవకాశం ఉండటం తో ఆమెపై పిడి యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్ల కాలంలో ఐదు కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే ఏడాది పాటు నో బెయిల్, ఎవరిని కలిసేందుకు అనుమతి ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments