Tuesday, April 14, 2026
Google search engine
HomeUncategorizedనేడు ఇంటర్ ఫలితాలు

నేడు ఇంటర్ ఫలితాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో కలిసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చే యనున్నారు. http://tgbie.cgg.gov.in, http: //results.cgg.gov.in వెట్‌సైట్‌లో విద్యార్థులు ఇంటర్ ఫలితాల చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయి తే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బో ర్డు ఫలితాలను విడుదల చేయనుంది.

ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు.

వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు

రాష్ట్రంలో విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు తెలంగాణ మీసేవా వాట్సాప్ చాట్‌బాట్ వాట్సాప్ ద్వారా నేరుగా తమ పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీసేవా తెలంగాణ వాట్సాప్ నెంబర్ 8096958096కు ‘Hi’ అని మెసేజ్ పంపించడం ద్వారా మీసేవా చాట్‌బాట్ మొదలవుతుంది. ‘BIE Exam Result’ టైప్ చేసి Open Service ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ) స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకుని సమర్పిస్తే ఇంటర్ ఫలితం తక్షణమే వాట్సాప్‌లో వస్తుంది.

రేపు దోస్త్ నోటిఫికేషన్

రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్న నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ సోమవారం(ఏప్రిల్ 13) విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉదయం 11.30 గంటలకు చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేయనుననారు. ఈసారి డిగ్రీ కోర్సులలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేశారు.బిఎస్‌సిలో 9, బిబిఎలో 5, బి.కాంలో 3, బి.ఎలో 2, బిఎస్‌సి ఆనర్స్ నాలుగేళ్ల కోర్సులోనూ కొత్తగా 4 కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments