Tuesday, April 14, 2026
Google search engine
HomeUncategorizedత్వరలో బిసిలకు సబ్‌ప్లాన్

త్వరలో బిసిలకు సబ్‌ప్లాన్

మన తెలంగాణ/నాంపల్లి: దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతున్నదని, డీలిమిటేషన్ ప్రక్రియల్లోనూ చట్టసభలకు సీ ట్లు పెంచడంలోనూ అదే తరహాలో వ్యవహరిస్తున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2011 జనాభా లె క్కల ప్రకారం కేంద్రం ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ద్రవిడ రాష్ట్రాల రాజకీయ ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ మేరకు శనివారం రవీంధ్రభారతిలో రాష్ట్ర బీసీ సం క్షేమశాఖ పక్షాన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాపాలన సర్కార్ సామాజిక స్పృహ, సామాజిక న్యాయానికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందని, త్వరలో బీసీలకు సబ్‌ప్లాన్ గురిం చి ఆలోచన చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నదని, అదే ఇతర పార్టీలు అ ధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని

తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఒక రూపాయి పన్ను ల రూపంలో వెళ్లగా.. తిరిగి 37 పైసలు మాత్రమే పంపిస్తున్నదని, అదే బీజేపీ పాలిత యూపీ, ఎం పీ, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్నదని ఆయన వివరించారు. నిధుల రాబడిలో కేంద్రం తెలంగాణకు నష్టం చేస్తోందని, రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకీకరణ యత్నం జరుగుతుందని, ఈ నేపథ్యంలో బహుజనులు ఏ కం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేలు, లోకసభ స్థానాలు పెరుగాల్సి ఉన్నదని, కానీ, కేంద్రం మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు యత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా సీడబ్లూసీ సమావేశంలో సీఎం రేవంత్ గళం విప్పరాని, దీని గురించి పెద్ద చర్చ జరుగుతోందని గుర్తుచేశారు.

కేంద్రం ఇష్టారీతిన, రాజకీయ దురుద్దేశంతో దక్షిణాది రాష్ట్రాలను బలహీనపర్చేందుకు కేంద్రం పన్నుల్లో వాటాను తగ్గించిందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తోందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ బీసీ ఉద్యమ నాయకులు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేశ్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బీసీ ఆర్థిక సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీడీని ఆవిష్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments