Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedపాతబస్తీకి ‘సర్’ ఫీవర్

పాతబస్తీకి ‘సర్’ ఫీవర్

 హైదరాబాద్ పాతబస్తీలో తూతూమంత్రంగా ‘సర్’ ప్రక్రియ

వెరిఫికేషన్‌లో బిఎల్‌ఓలకు బదులు వారి అసిస్టెంట్లు

అక్షర జ్ఞానం లేని అసిస్టెంట్లతో అవస్థలు

ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు ..బడా నేతల ఒత్తిళ్లు

ఓటు హక్కు లేనివారి పేర్లూ జాబితాలో చేరుతున్న వైనం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘సర్’ సమర్థవంతంగా జరగడంలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఓ) నుండి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తీసుకుని ఇష్టారాజ్యంగా రివిజన్ నమో దు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతనగరంలో రాజకీయ ఒత్తిడితో సర్ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోందనేది ప్రధాన ఆరోపణ. చాంద్రాయణగుట్ట, చా ర్మినార్, బహదూర్‌పుర, యాకుత్‌పురా తదిత ర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ‘సర్’ ఇష్టారాజ్యంగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఓటరు సవరణలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని, అధికంగా ఓటు హక్కులేని వార్ల పేర్లు కూడా చేరే ప్రమాదం లేకపోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంతో సమర్థవంతంగా, పొరపాట్లు, తప్పులు లే కుండా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాల్సిన జీహెచ్‌ఎంసి అధికార యంత్రాంగం ఇప్పుడు అక్రమాలకు మరోమారు తావిచ్చిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓటరు సవరణకే పరిమితం కా కుండా మరింత లోతుగా ఓటరు డాక్యుమెంట్స్‌ను తనిఖీ చేసే ప్రక్రియ ను చేపట్టాల్సిన బి ఎల్‌ఓలు కేవలం తమ అసిస్టెంట్లను ఏ ర్పాటు చేసుకుని ‘సర్’ ప్రక్రియను పూర్తిచేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. స్వీపర్లుగా కూడా బిఎల్‌ఓలుగా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్వీపర్లు, నిరక్షరాస్యులు కూడా బిఎల్‌ఓలుగా ఉండటంతో వారి నుండి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తీసుకుని పలువురు ఇష్టారాజ్యంగా ‘సర్’లో వివరాలను నమోదు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. పలువురు ఓల్డ్ సిటీలో డ్యూటీలు చేసే బిఎల్‌ఓలు నేరుగా విధులను నిర్వహించకుం డా.. తమతమ అసిస్టెంట్లను వెరిఫికేషన్‌కు పంపించడంతో అసిస్టెంట్లు సర్ ప్రక్రియను పూర్తిచేయడంపైనే ఫోకస్ పెడుతున్నారే తప్ప కచ్ఛితంగా అవసరమయ్యే డాక్యుమెంట్లను మరింత లోతుగా తనిఖీలు చేయడంలేదనేది ప్రధాన ఆరోపణ. సర్ ద్వారా బోగస్ ఓట్లు, చ నిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వాటిని తొలగించాల్సి ఉంది. కానీ, ఈ ప్రక్రియను చేసేందుకు నిరక్షరాస్యులు వెల్లుతున్నందున సమర్థవంతంగా జరుగడంలేదనేది ప్రధాన ఆరోపణ.

ప్రతి ఇంటికి..

బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఓ)లకు 2002 సంవత్సరంనాటి ఓటరు జాబితాను అందించడంతో పాటు బిఎల్‌ఓ యాప్‌ను వారి ఫోన్‌ల డౌన్‌లోడ్ చేసి ప్రక్రియను చేపడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళుతూ ఓటరు జాబితాలోని పేర్లను, వారి కుటుంబ సభ్యుల వివరాలతో పోల్చిచూస్తున్నారు. ఓటరుగా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను, వారి కుటుంబ సభ్యుల వివరాలను సరిపోల్చడం జరుగుతుంది. 18 సం.లు నిండినట్టు అధికారిక డాక్యుమెంట్లు ఉంటే కొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఓల్డ్ సిటీలో చాలా వరకు డబుల్‌గా ఓటరు జాబితాలో ఉన్నట్టు బిఎల్‌ఓలు గుర్తిస్తున్నట్టు సమాచారం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించి తొలగించేస్తున్నారు. చనిపోయిన వారు, ఇల్లు మారి వేరే చోటుకి వెళ్ళిపోయిన వారు, అనర్హులైన ఓటర్లను, ఒకటి కంటే రెండు చోట్ల ఓటర్లు ఉన్నవారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించే ముందు కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments