Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఉద్యోగుల జెఎసి పోరుబాట

ఉద్యోగుల జెఎసి పోరుబాట

మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో పోరాడడానికి సిద్ధమని టిజిఈజేఏసి ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపును రూ.1500 కో ట్లకు పెంచాలని, పీఆర్సీ కమిషన్ రిపోర్టును తెప్పించి జూన్02వ తేదీ లోపు అమలు చే యాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్ర భుత్వానికి సూచించారు. ఉద్యోగులకు సం బంధించి పలు పెండింగ్ సమస్యల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్, హైదరాబాద్ (టిజిఈజేఏసి) నాయకులు హైదరాబాద్‌లోని రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరు ప్రధాన డిమాండ్‌ల ను ఏకగ్రీవంగా ఆమోదించడంతో పాటు ప లు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా చూడాల ని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిం ది. దీంతోపాటు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు,

సామూహిక నిరసన దీక్షలు చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన భోజన విరామ సమయంలో మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. మే 05వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో, ధర్నా చౌక్‌లో సామూహిక నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. మే 14వ తేదీలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ పి.దామోదర్ రెడ్డి, చావా రవి, వంగా రవీందర్‌రెడ్డి, జి.సదానందం గౌడ్, మధుసూదన్ రెడ్డి, శ్యామ్, ముజీబ్ హుస్సేనీ, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్, ఎం.చంద్రశేఖర్ గౌడ్, ఎంబి కృష్ణయాదవ్, నరేష్, వివిధ జిల్లా చైర్మన్‌లు, కన్వీనర్‌లు పాల్గొన్నారు.

సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా..

పీఆర్సీ కమిటీ ఏర్పాటు దాదాపు 30 నెలలు పూర్తయినందున ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో తెలంగాణలో 2వ పిఆర్సీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయిస్తున్నా బకాయిలు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో దానిని రూ.1500 కోట్లకు పెంచాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈహెచ్‌ఎస్ విధి, విధానాలను వెంటనే అమలు చేసి మే01వ తేదీ నుంచి ఉద్యోగులు, పెన్షనర్‌లకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలి. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపిఎస్‌ను వెంటనే పునరుద్ధరించాలి. ఉద్యోగుల సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 5 గ్రామాలను గతంలో ఎపిలో కలిపిన వాటిని తిరిగి మళ్లీ తెలంగాణలో వాటిని విలీనం చేయాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments