Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedమంగళవారం రాశి ఫలాలు (30-03-2026)

మంగళవారం రాశి ఫలాలు (30-03-2026)

మేషం

బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం

వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

మిధునం

సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం

ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

సింహం

చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది.

కన్య

చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

తుల

కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం

బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

ధనస్సు

జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం

మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మీనం

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments