Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedప్రతిపక్షం లేకుండానే నేడు బడ్జెట్‌కు ఆమోదం

ప్రతిపక్షం లేకుండానే నేడు బడ్జెట్‌కు ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ స మావేశాలను అక్రమ మైనింగ్ అంశం సభను కుదుపేసింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభా కార్యకలాపాలను అడ్డుకుంది. రెండు రోజులుగా ఇదే అంశం తో సభ ను బీఆర్‌ఎస్ సభ్యులు స్తంబింబిం చేయడంతో వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (సోమవారం వరకు) సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆమోదించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే సోమవారం ప్రవేశపెట్టనున్న ద్రవ్యవిబిల్లు ఆమోదం పొందనున్నది.ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసిన హౌస్ కమిటీకి ససేమిరా అంగీకరించని ప్రభుత్వం, ధరణి చట్టం పేరిట గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై హౌస్ కమిటీకి అంగీకరిస్తారా?

అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరి రెండు రోజులుగా సభలో జరిగిన చర్చను మరో మలుపు తిప్పారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి సంజ్ఞలతో చేసిన అనుచిత ప్రవర్తన చివరకు ఎథిక్స్‌కు కమిటికి సిఫారసుకు దారితీసింది. ఈ కమిటీ పాడి కౌశిక్‌రెడ్డి శాసనసభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుకు సిఫారసు చేస్తుందా? లేక మరేదైన చర్యకు సిఫారసు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ చేయబోయే సిఫారసు భవిష్యత్‌లో మరే సభ్యుడు కూడా పాడి కౌశిక్‌రెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా కఠినంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దీంతో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన మాదిరిగానే చర్యలు ఉండే అవకాశం ఉంది. కాగా అక్రమ మైనింగ్ వ్యవహారం సభలో చివరకు దళిత సామాజిక వర్గం సభ్యుడికి జరిగిన అవమానంగా కొత్త రంగు పులుముకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments