Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedసంఘటిత శక్తితో సవాళ్లను ఎదుర్కొందాం

సంఘటిత శక్తితో సవాళ్లను ఎదుర్కొందాం

నోయిడా : వికసిత భారత్ బృహత్తర లక్ష సాధనలో దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సంఘటిత శక్తి అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మన ముందు పలు సవాళ్ల భారీ లక్షం నిలిచి ఉంది. పలు ప్రపంచ స్థాయి సవాళ్లతో మైలురాయి చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉంటాయని తెలిపారు. జెవార్‌లో ప్రధాని మోడీ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మాట్లాడారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు మనం అంతా కలిసి సమైక్యంగా, అంకితభావంతో ముందుకు సాగాల్సి ఉందని పిలుపు నిచ్చారు. సవాళ్లు వస్తూనే ఉంటాయని, వీటిని తగు విధంగా ఎదుర్కొం టూ పయనించడమే మన ధర్మం అని ప్రధాని తెలిపారు. తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. రైతులు , సగటు కుటుంబాల శ్రేయస్సు ప్రాతిపదికన కార్యాచరణకు దిగుతుంది.

పౌరులకు పలు విషయాలలో వెసులుబాటు కల్పించాలి. వారి సమ యం ఆదా కావాలి. అవనవసర వ్యయాలు తగ్గాలి. ఈ క్రమంలో ఒనగూరే ప్రయోజనాలు సామాన్యులకు దక్కాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన, ఈ దిశలోనే అమ లు ప్రక్రియ అని తెలిపారు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం, చమురు సంక్షోభం అంతర్జాతీయ సవాలుగా తలెత్తి మన గడపలోకి కూడా చేరింది. ఇది గ్లోబల్ సంక్షోభం. ప్రశాంతతతో, స్థిరచిత్తతతో ఇప్పటి సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనమే గెలుస్తామని అన్నారు. పరిస్థితిని తాము పార్లమెంట్‌లో చర్చించడం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో సమీక్షించామని వివరించారు. ప్రస్తుత సంక్షోభం దశలో అనుసరించాల్సిన అంశాలపై దృష్టి సారించాం. సరఫరాల వ్యవస్థ కుంటుపడకుండా చేయడం, ఇంధన, నిత్యావసర సరుకుల పంపిణీ లోపాలను నివారించడంలో టీమిండియా స్ఫూర్తి అవసరం అని ముఖ్యమంత్రులకు తాము తెలిపినట్లు ప్రధాని ఈ సభ ద్వారా వెల్లడించారు.

‘నోయిడా కీడు’ సెంటిమెంట్‌ను తిప్పికొట్టాం

ప్రధాని మోడీ శనివారం నోయిడా కీడు.. సంబందిత మూఢనమ్మకం గురించి ప్రజలకు తెలియచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇంతకు ముందు అధికారం లో ఉన్న సమాజ్‌వాది పార్టీ నేతలకు చురకలు అంటించారు. నోయిడా స భలకు రావద్దని, వస్తే ప్రధాని పదవి పోతుందని అప్పటి సిఎం హోదాలో అఖిలేష్ యాదవ్ తనకు చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఇక్కడికి వస్తే ప్రధాని పదవి ఊ డుతుందని అంతకు ముందటి వరకూ ఉన్న మూఢనమ్మ కం గురించి తెలిపారని , అయితే ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి ఏమి చేయలేదని, తనను మరింత బలోపే తం చేస్తుందని చెప్పి తాను అప్పట్లో నోయిడాకు వచ్చిన విషయం చెప్పారు. సమాజ్‌వాది పార్టీ నేతలు నోయిడా అపశకునం భయంతో ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. దీనిని గాలికొదిలారు. అయితే ఈ నగరాన్ని తమ కమిషన్లకు, అవినీతి వ్యవహారాలకు అవసరం అయిన డబ్బు దండుకునే ఎటిఎంగా వాడుకున్నారు. అయితే బిజెపి వచ్చిన తరువాత నోయిడా దారి మారిందని, ఇప్పుడు ఇక్కడి ప్రారంభోత్సవం ఇందుకు నిదర్శనం అన్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments