Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedవిజయవాడలో ఉగ్రవాద ముఠా గుట్టురట్టు

విజయవాడలో ఉగ్రవాద ముఠా గుట్టురట్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్‌ఐఎస్, ఆఖిస్ (ఎక్యూఐఎస్)లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మ ద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్, మీర్జా సో హైల్ బేగ్‌లుగా గుర్తించారు. అరెస్టయిన యువకులు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం దేశంలోని 7 రాష్ట్రాలకు చెందిన సుమారు 42 మంది యువకులతో ఒక రహస్య సోషల్ మీ డియా గ్రూప్ నడుస్తోంది.

ఈ గ్రూప్ ద్వారా ఐఎస్‌ఐఎస్ (ఐఎస్‌ఐఎస్), కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న యువకుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కొన్ని అనుమానాస్పద పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసు కున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో కీలకమైన ఆడియో క్లిప్పింగ్‌లు, జిహాదీ మెసేజ్‌లు లభించాయి. ప్రస్తు తం 42 మంది సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments