Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedబియ్యం ఎగుమతులపై సభా సంఘం వేయాలి

బియ్యం ఎగుమతులపై సభా సంఘం వేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి చేస్తున్న బియ్యం ఎగుమతుల వ్యవహారంలో భారీ కుభంకోణం దాగి ఉందని బి ఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆ రోపించారు. దీనిపై సభా సంఘం వేసి అందులో తనను సభ్యుడిగా నియమించాలని హరీశ్‌రావు డి మాండ్ చేశారు. సోమవారంనాడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఉత్తమ్, హరీశ్‌రావు నడుమ ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. ఇ తర దేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు సల హాదారుగా వేల కోట్ల బ్యాంకింగ్ ఫ్రాడ్, బంగా రం స్మగ్లింగ్, ఇడి, సిబిఐ, కేసులు ఉన్న ప్రేమ్ చం ద్ గార్గ్‌ను నియమించుకున్నారా? లేదా? అని ప్ర శ్నించారు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని హరీశ్ రావు ఆరోపించారు.

ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది లక్షల మొట్రిక్ టన్నులకు ఎంఓయు కుదుర్చుకుని, 22, 750 మెట్రిక్ టన్నుల వద్ద ఎందుకు ఎగుమతులు ఆగాయని నిలదీశారు. నాఫెడ్ ఎండి ఎగుమతుల అవకాశం నాఫెడ్‌కు ఇవ్వాలని లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వకుండా ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారని, దీని వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. కాకినాడ పోర్టులో ఏడాది నుంచి సుమారు 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని, ఏడాది నుంచి బియ్యం ఉంటే అవి పాడయిపోతాయని, వాటికి సంబంధించి గిడ్డంగి, నిర్వహణ చార్జీలు ఎవరు చెల్లిస్తున్నారని, ఇతర ఖర్చులు ఎవరు భరించాలిని అడిగారు. వాటాలు కుదరకపోవడం వల్లనే బియ్యం ఎగుమతులు ఆగిపోయాయని హరీష్ రావు ఆరోపించారు. బియ్యం ఎగుమతులు ప్రారంభించడానికి హెలికాఫ్టర్‌లో వెళ్లారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగం సంస్థలు అడ్వాన్స్‌గా డబ్బులు ఇస్తామన్నా ఎగుమతి అవకాశం ఇవ్వలేదని, స్కాం నిరూపించడానికి హౌస్ కమిటీ వస్తే పూర్తివివరాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు హరీశ్‌రావు చెప్పారు.

బియ్యం ఎగుమతుల్లో స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరిందని విమర్శించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సూటిగా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తూ సభను పక్కదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు మంత్రిపై మండపడ్డారు. మంత్రి సత్యదూరమయిన మాటలు సభలో మాట్లాడుతున్నారని, ఈ విషయం ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకంగా ఉంటే, తప్పు చేయలేదని బావిస్తే ఈ కుంభకోణాలపై హౌజ్ కమిటీ వేయాలని, ఆధారాలతో నిరూపిస్తామని హరీశ్‌రావు సవాల్ విసిరారు. దీంతో పాటుగా రైతులకు యాసంగికి సంబంధించి రూ.1,200 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉందని వాటిని ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ దశలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుబంద ప్రశ్నలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం వరి దిగుబడి లెక్కలు అస్తవ్యస్థంగా ఉన్నాయని, పంటల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని, ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు దళారుల వలకు చిక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments