Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedకవితకు సిబిఐ నోటీసు

కవితకు సిబిఐ నోటీసు

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో కీలక ప రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎ దుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి గురువారం మధ్యాహ్నం వె ళ్లిన సిబిఐ అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరు కావాల ని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశా రు. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చిన సంగతి విదితమే. సిబిఐ మోపిన అభియోగాలు నిరాధా రమని కోర్టు అప్పట్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ట్రయల్ కోర్టులో ఇడి కేసు విచారణను వాయిదా వేయాలని ఆదేశించడంతో పాటు, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ అధికారు లు కవితకు సమన్లు అందించారు. కవితతో పాటు వ్యాపార వేత్తలు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సమన్లు అందాయి.

సిబిఐ సమన్లపై కవిత ఏమన్నారంటే..

ఈ విషయంపై కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆమె ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయమూ మీ అవగాహనలో ఉందని కవిత ఎక్స్ లో పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా తెలియచేశారని కవిత తెలిపారు. ఈ విషయంపై తమ లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నామని, సత్యం నా తోడుగా సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో పోస్టు ద్వారా తన స్పందనను తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments