Wednesday, April 22, 2026
Google search engine
HomeUncategorizedహెడ్ కానిస్టేబుల్‌కు తెలంగాణ పోలీస్ హీరోస్ గ్యాలంటరీ అవార్డు

హెడ్ కానిస్టేబుల్‌కు తెలంగాణ పోలీస్ హీరోస్ గ్యాలంటరీ అవార్డు

శంకర్ పల్లి మున్సిపాలిటీ లోని సింగపూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి రాష్ట్ర గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక అయ్యారు.విధినిర్వహణలో భాగంగా ప్రాణాలు ఫణంగా పెట్టి ఓ దొంగను పట్టుకునేందుకు వెళ్లి బుల్లెట్ గాయాలు అయినా అతని ధైర్య సాహసలకు మెచ్చి ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.గత సంవత్సరం గచ్చిబౌలిలోని ఒక పబ్బులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాక్కున్నడనే పక్కా సమాచారంతో సి సి ఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తో పాటు మరో కానిస్టేబుల్ వెళ్లిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి ఆగస్టులో ఇవ్వబోయే దేశం మొత్తం నుంచి గ్యాలన్టరీ అవార్డును వెంకటరెడ్డికి ఇవ్వన్నారు. ఈ అవార్డు రావడం శంకరపల్లి పట్టణ తో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దక్కిన గౌరవం అని అన్నారు.అవార్డుకు ఎంపిక అయినా వెంకట్ రెడ్డి కి అటు పోలీసులతో పాటు సింగపూర్ గ్రామ ప్రజలు, చిన్ననాడు కలిసి చదువుకున్న పదవ తరగతి బ్యాచ్ సహచరులు, మిత్రులు అభినందనలు తెలిపారు.జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు పేరు ప్రాఖ్యాతలు తీసుకువచ్చి,, చేసిన ఉద్యోగానికి న్యాయం చేసిన వెంకట్ రెడ్డి కి ప్రతి ఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments